రుద్రగా మహేష్‌.. ఏమున్నాడురా బాబు.. అదిరిపోయింది అంతే !

Published : Nov 15, 2025, 08:08 PM IST

SSMB29 Globetrotter : సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు ‘వారణాసి’ టైటిల్‌ను గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో ప్రకటించారు. రుద్రగా మహేష్ బాబు పవర్‌ఫుల్ లుక్‌తో వీడియోలు వైరల్ గా మారాయి.

PREV
13
మహేష్–రాజమౌళి కాంబినేషన్‌పై దేశవ్యాప్త ఆసక్తి

స్టార్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న పాన్‌ వరల్డ్ ప్రాజెక్ట్‌ SSMB29 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలల క్రితమే షూటింగ్ ప్రారంభమైన ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ పై అభిమానుల ఉత్సాహం రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల విడుదలైన మహేష్‌ బాబు ప్రీలుక్‌ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో సుడిగాలిలా వైరల్ అయ్యి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

ఇదిలా ఉండగా, శనివారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ సినిమా ప్రమోషన్స్‌కి అంతర్జాతీయ స్థాయిలో సెట్టింగ్ ఇచ్చింది. వేలాదిమంది అభిమానులు హాజరైన ఈ వేడుకలో చిత్ర యూనిట్ పలు కీలక విషయాలను అధికారికంగా ప్రకటించింది.

23
‘వారణాసి’ టైటిల్.. ఈవెంట్‌లో అలరించిన గ్లింప్స్

ఎప్పటి నుంచో సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, ఈవెంట్ ప్రారంభంలోనే SSMB29 అధికారిక టైటిల్‌ను ప్రకటించారు. అభిమానులు భావించినట్లుగానే, చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో ఈవెంట్ స్క్రీన్‌పై ప్రదర్శించగానే అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.

వీడియోలో మహేష్ బాబు ఎద్దుపై స్వారీ చేస్తూ, శివుడి వర్ణనను గుర్తు చేసేలా కనిపించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్‌ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ఆ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. అభిమానులు వీడియో క్లిప్స్‌ను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల్లో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

33
స్టార్ కాస్ట్.. రుద్ర, మందాకిని, కుంభతో కథ ఏ స్థాయిలో ఉంటుందో మరి !

వారణాసి చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. కథలో కీలకమైన మందాకిని పాత్రను బాలీవుడ్ స్టార్ ప్రియంకా చోప్రా పోషిస్తున్నట్లు ఈవెంట్ ద్వారా స్పష్టమైంది. ఆమె పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్రం ప్రధాన ప్రతినాయకుడిగా కుంభ పాత్రలో ప్రేక్షకులను భయపెట్టనున్నారు. ఆయన పాత్ర డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని యూనిట్ టాక్.

ఈవెంట్‌లో మిగతా క్యారెక్టర్స్, టెక్నిషియన్స్ వివరాలను కూడా త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. మహేష్‌, రాజమౌళి, అంతర్జాతీయ టాలెంట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులను సెట్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories