Published : Nov 15, 2025, 07:05 PM ISTUpdated : Nov 15, 2025, 07:39 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీకి ''వారణాసి'' టైటిల్ ను ఫిక్స్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ టైటిల్ రివిల్ అయ్యింది. ఈసినిమాకు ''వారణాసి'' టైటిల్ ను ఫిక్స్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతోన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో.. ఈసినిమా టైటిల్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ వీడియోను కూడా ఈసందర్భంగా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని, ఎద్దుపై సవారీ చేస్తూ క్రేజీ లుక్ లో కనిపించాడు. పవర్ ఫుల్ వీడియోను '' వారణాసి'' టైటిల్ కార్డ్ తో ఎండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
25
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అభిమానులు
మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ వారణాసి. ఈసినిమా అప్ డేట్స్ కోసం ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే.. ఈ సినిమా టైటిల్ వీడియో చూసి పూనకాలతో ఊగిపోతున్నారు. మొదటి నుంచి ఈసినిమా టైటిల్ పై రకరకాల ప్రచారం జరిగింది. ఫైనల్ గా ఈమూవీకి ‘’వారణాసి'' టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్టు కొంత కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈమధ్య మహేష్ బాబు ఫేస్ కనిపించకుండా ఓ లుక్ ను రిలీజ్ చేశారు. ఆలుక్ చూసిన తరువాత ఈసినిమాకు ‘’వారణాసి'' టైటిల్ ఫిక్స్ అనే అభిప్రాయానికి వచ్చారు ఫ్యాన్స్. అందరు అనుకున్నట్టుగానే అదేటైటిల్ అనౌన్స్ అయ్యింది.
35
వారణాసి సినిమాపై భారీ అంచనాలు
ఈసినిమా స్టార్ట్ కాకముందు నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్, రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్.. పైగా ఇప్పటి వరకూ ఎవరు ఖర్చు పెట్టనంతగా.. 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని తెలియడంతో.. దేశ వ్యాప్తంగా అందరి చూపు.. ఈసినిమాపైనే పడింది. అంతే కాదు రాజమౌళి ఇంకేం మ్యాజిక్ చేస్తాడా అని అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు ఈసినిమాను గమనిస్తున్నారు. అటు మహేష్ బాబు ఫ్యాన్స్ లో కూడా ఈసినిమా గురించిన ఆత్రుత పెరిగిపోయింది. తాజాగా జరుగుతున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పై కూడా భారీగా ప్రచారం చేశారు మహేష్ అభిమానులు
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో.. ఈ భారీ సినిమా తెరకెక్కుతోంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమాలో గ్లొబల్ బ్యూటీ.. ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీరిద్దరికి సబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిసెంట్ గా రిలీజ్ చేశారు టీమ్. మందానికి పాత్రలో సందడి చేయబోతోంది ప్రియాంక చోప్రా. ఇక పృథ్విరాజ్ సుకుమారన్ లుక్ పై ఎన్నో మీమ్స్ ట్రోల్స్ కూడా వచ్చాయి. రాజమౌళి హాలీవుడ్ ను కాపీచేశారని... తమిళ సినిమా 24 లో సూర్య లుక్ లా ఉందంటూ.. ఎన్నో కామెంట్స్ వచ్చాయి.
55
రెండు భాగాలుగా తెరకెక్కుతోందా?
ఇక వారణాసి సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈమూవీని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈసారి 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ టార్గెట్ గా ఈసినిమాను ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈసినిమాలో.. హీరోయిన్ శృతీ హాసన్ ఓ సాంగ్ కూడా పాడి సందడి చేసింది. ఎన్నో విశేషాల నడుమ.. ఈసినిమా టైటిల్ రిలీజ్ అయ్యింది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.