Gautham: ఆ మూవీలో మహేష్ బాబు కాదు, గౌతమ్ నటించాలి.. తాతని, తండ్రిని మించిపోయాడు.. మైండ్ బ్లోయింగ్ లుక్

Published : Jul 12, 2026, 05:09 PM IST

Gautham Ghattamaneni: మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబైలో జరిగిన ది ఒడిస్సి ప్రీమియర్స్ లో గౌతమ్ పాల్గొన్నాడు.

PREV
15
Gautham Ghattamaneni

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తిరుగులేని హీరోగా ఎదిగారు. అందం, నటనలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతటి క్రేజ్ సొంతం చేసుకున్నారో.. మహేష్ బాబు అంతకు మించేలా అభిమానులని మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చిత్రంలో నటిస్తున్నాడు.

25
గౌతమ్ లేటెస్ట్ లుక్ వైరల్

మహేష్ బాబు తనయుడు గౌతమ్ విదేశాల్లో ఉంటూ యాక్టింగ్ పై మెళుకువలు నేర్చుకుంటున్నాడు. ప్రస్తుతం గౌతమ్ వయసు 19 ఏళ్ళు. దీనితో ఘట్టమనేని వారసుడి ఎంట్రీ పై అప్పుడే ప్రచారం మొదలైపోయింది. తాజాగా గౌతమ్ ఘట్టమనేని సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. అతడి లేటెస్ట్ లుక్ వైల్డ్ ఫైర్ లా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

35
వరల్డ్ ఫేమస్ డైరెక్టర్

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ తెరకెక్కించిన ది ఒడిస్సి చిత్రం జూలై 17న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్ర ప్రీమియర్స్ ని ముంబైలో నిర్వహించారు. ప్రీమియర్స్ కి క్రిస్టఫర్ నోలెన్ తో పాటు.. హాలీవుడ్ స్టార్ మాట్ డామన్ , ది ఒడిస్సి చిత్ర యూనిట్ హాజరయ్యారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ప్రీమియర్స్ లో పాలుపంచుకున్నారు.

45
ది ఒడిస్సి ప్రీమియర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా సూటు బూటులో రెడ్ కార్పెట్ పై మెరిసాడు. గౌతమ్ లేటెస్ట్ లుక్, మేకోవర్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ స్టార్స్ ని తలదన్నే స్టైలిష్ లుక్ తో గౌతమ్ అదరగొడుతున్నాడు.

55
ఆ మూవీలో గౌతమ్ నటించాలి

అందంలో తాతని, తండ్రిని గౌతమ్ మించిపోయేలా ఉన్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు అయితే జేమ్స్ బాండ్ మూవీలో నటించాల్సింది మహేష్ బాబు కాదు.. గౌతమ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories