ఆ సినిమా ఎందుకు చేశాను బాబోయ్, జీవితంలో అలాంటి తప్పు చేయను.. డిజాస్టర్ మూవీపై మహేష్ షాకింగ్ కామెంట్స్ 

First Published | Dec 23, 2024, 11:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించానని అన్నారు. అదే విధంగా డిజాస్టర్ సినిమాలు కూడా చేశాను అని తెలిపారు. కానీ ఒక డిజాస్టర్ మూవీలో నటించడం మాత్రం తన కెరీర్ లో చేసిన బిగ్ మిస్టేక్ అని తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించానని అన్నారు. అదే విధంగా డిజాస్టర్ సినిమాలు కూడా చేశాను అని తెలిపారు. కానీ ఒక డిజాస్టర్ మూవీలో నటించడం మాత్రం తన కెరీర్ లో చేసిన బిగ్ మిస్టేక్ అని తెలిపారు. అలాంటి సినిమా ఇక జీవితంలో చేయను అని తేల్చేశారు. ఇంతకీ మహేష్ చెప్పింది ఏ సినిమా గురించో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ సినిమా బావుంటే ఆడియన్స్ నుంచి సహకారం ఉంటుంది. సినిమా బాగలేకపోతే వాళ్లే ఆ మూవీని త్వరగా చంపేస్తారు. ఈ రెండింటికి సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు చేస్తే నా అభిమానులకు నేను సమాధానం చెప్పుకోలేను. ఎందుకంటే అది కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రం. ఏదీ సరిగ్గా వర్కౌట్ కాలేదు. 


బ్రహ్మోత్సవం: 11.53

ఆ స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేయడమే నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అని మహేష్ బాబు అన్నారు. అసలు ఆ కథని ఎందుకు ఎంచుకున్నానా అని ఫీల్ అయ్యా. ఇకపై అలాంటి తప్పులు రిపీట్ చేయను అని మహేష్ బాబు తెలిపారు. బ్రహ్మోత్సవం నా అభిమానులకు మాత్రమే కాదు ఆడియన్స్ కి కూడా నచ్చలేదు. 

విచిత్రంగా నాకు ఫ్లాప్ సినిమా పడ్డ ప్రతిసారీ నా మార్కెట్ పెరుగుతూ వచ్చింది. బ్రహ్మోత్సవం తర్వాత స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ తన కెరీర్ లోనే హైయెస్ట్ అని మహేష్ తెలిపారు. కొన్ని కథలు తనకి నచినప్పటికీ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేయలేక పోతున్నా అని అన్నారు. 

ఇదిలా ఉండగా త్వరలో మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తన కెరీర్ లోనే భారీ చిత్రానికి రెడీ అవుతున్నారు. జనవరిలో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. 

Latest Videos

click me!