మహేష్ బాబుకే మైండ్ బ్లాక్ చేసిన మహానటుడు ఎవరో తెలుసా, పెద్ద స్టార్ అనుకుంటే పొరపాటే
ఆ కుర్రాడి నటన అన్ బిలీవబుల్ అంటూ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. అతడి యాక్టింగ్ షాకింగ్ గా అనిపించిందట. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందాం.
ఆ కుర్రాడి నటన అన్ బిలీవబుల్ అంటూ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. అతడి యాక్టింగ్ షాకింగ్ గా అనిపించిందట. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందాం.
చిత్ర పరిశ్రమలో ట్యాలెంట్ ఉన్న నటులు చాలా మంది ఉంటారు. కానీ కొందరికి మాత్రమే అవకాశాలు వస్తుంటాయి. మరికొందరు అదృష్టం లేకపోవడం వల్ల, కొన్ని ఇతర కారణాల వల్ల సరైన గుర్తింపునకు నోచుకోరు. అలాంటి నటుడి గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు నటించిన చిత్రాల్లో కొన్ని థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని బుల్లితెరపై హిట్ అయ్యాయి. అలాంటి చిత్రాల్లో ఖలేజా ఒకటి. ఖలేజా చిత్రంలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ గమ్మత్తుగా ఉంటుంది. ఈ చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖలేజా చిత్రం కోసం త్రివిక్రమ్ గారు నటీనటుల్ని ఎంపిక చేసిన విధానం అద్భుతం అని అన్నారు.
గ్లిజరిన్ అవసరం లేకుండా కన్నీళ్లు పెట్టుకోవడం అతికొద్ది మంది నటీనటులకు మాత్రమే సాధ్యం. మహానటి సావిత్రి అందులో ముందు వరుసలో ఉంటారు. ఆమె సన్నివేశంలో కన్నీళ్లు పెట్టుకునే విధానం, దర్శకుడు చెప్పినట్లు అద్భుతంగా హావ భావాలు పలికించడం ఇలా చాలా విన్నాం. మహేష్ బాబుకి ఖలేజా సెట్స్ లో ఒక మహానటుడు మైండ్ బ్లాక్ చేశాడట. మహేష్ కే మైండ్ బ్లాక్ చేసిన అతడు పెద్ద స్టార్ ఏమీ కాదు. కనీస గుర్తింపు కూడా లేదు అతడికి. మహేష్ బాబు అతడి గురించి మాట్లాడుతూ.. పూణే లో సదా శివా సన్యాసి సాంగ్ షూటింగ్ జరుగుతోంది.
సాంగ్ జరుగుతున్నప్పుడు ఆ విలేజ్ లో ఉన్న వారిలో ఒక కుర్రాడు వచ్చి నా చేయి పట్టుకుని ఏడవాలి. అతడి పేరు చైతన్య. అన్ బిలీవబుల్ యాక్టర్ ఆ కుర్రాడు. అతడు నా చేయి పట్టుకుని ఏడ్చే షాట్ రెడీ అయింది. ఏడ్చినప్పుడు కన్నీళ్లు రావాలి కాబట్టి ఇతనికి గ్లిజరిన్ తెచ్చి ఇవ్వండి అని చెప్పాను. వెంటనే ఆ కుర్రాడు.. సార్ నాకు గ్లిజరిన్ అవసరం లేదు సార్ అని అన్నాడు. గ్లిజరిన్ లేకుండా ఎలా కన్నీళ్లు వస్తాయి అని అడిగా.. నాకు వచ్చేస్తాయి సార్ అన్నాడు. వీడికి బలుపు మామూలుగా లేదుగా అని మనసులో అనుకున్నా.
సాంగ్ మ్యూజిక్ స్టార్ట్ కాగానే ఏడ్చేశాడు, కన్నీళ్లు వచ్చేశాయి. అంత ట్యాలెంట్ ఉన్న కుర్రాళ్ళని నేను చూడలేదు. షాకింగ్ గా అనిపించింది. అద్భుతమైన యాక్టర్ అతడు అంటూ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు.