vijay deverakonda
Vijay Deverakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ లైనప్‌లో మూడు సినిమాలున్నాయి. ప్రస్తుతం ఆయన `కింగ్‌డమ్`లో నటిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఈ మూవీ రూపొందుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 30న విడుదల కానుంది.
త్వరలోనే దీనికి సంబంధించిన అప్ డేట్ రానుంది. దీంతోపాటు విజయ్ దేవరకొండ రవి కిరణ్ కోలా, రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. ఇవి ఇంకా ప్రారంభం కాలేదు.
KINGDOM telugu movie teaser Vijay Deverakonda Gowtam Tinnanuri
విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా రూపొందించే చిత్రానికి దిల్ రాజు నిర్మాత. దీనికి `రౌడీ జనార్థన్` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారట. ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని తెలిపారు. ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
పీరియాడికల్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట రవి కిరణ్ కోలా. గ్రామీణ నేపథ్యంలో పూర్తి ఊర మాస్, రా అండ్ రస్టిక్ కథాంశంతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది.
Keerthy Suresh
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌కి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. చాలా రోజులుగా కథానాయిక కోసం అన్వేషణ జరుగుతుండగా తాజాగా ఫైనల్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మహానటి కీర్తి సురేష్‌ని ఓకే చేశారట. ఆమె `భోళా శంకర్` తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.
ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తెలుగుకి దూరమైంది కీర్తి. వరుసగా తమిళ చిత్రాలు చేస్తూ వచ్చింది. బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ చేదు అనుభవాన్ని ఫేస్ చేసింది. తమిళంలో బిజీగా ఉన్న ఆమె రెండేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు మూవీకి ఓకే చేసిందని సమాచారం.