ఇక ఉత్తమ నటుడికి అవార్డు ఇచ్చే క్రమంలో సరదా సంఘటన చోటు చేసుకుంది. ఉత్తమ నటుడిని ప్రకటించడానికి నాగార్జున, అమల వేదికపైకి వచ్చారు. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, ఎన్టీఆర్ టెంపర్, మహేష్ బాబు శ్రీమంతుడు, ప్రభాస్ బాహుబలి, నాని భలే భలే మగాడివోయ్ చిత్రాలతో ఉత్తమ నటుడి కేటగిరిలో నామినేట్ అయ్యారు.