ప్రభాస్ 'కల్కి' పై గరికపాటి ఫైర్‌.! పురాణాలను వక్రీకరిస్తారా?

First Published | Sep 24, 2024, 7:29 AM IST

  ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు 'కల్కి' సినిమాపై విమర్శలు చేసి మళ్లీ సినిమాని వార్తల్లోకి తెచ్చారు.

Garikapati Narasimha Rao, prabhas, kalki 2898 AD


ప్రముఖ వక్త, ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు వ్యంగ్యంగా మాట్లాడుతూ వాస్తవాలను మన ముందుంచుతూంటారు. ఈ క్రమంలో ఆయన చాలా వివాదాల్లో సైతం ఇరుక్కున్నారు.  సినిమాలపై సైతం ఆయన విమర్శలు చేస్తూంటారు. గతంలో అనేక  విషయాల్లో మాట్లాడిన ఆయన ఇప్పుడు ప్రభాస్ (Prabhas), నాగ్‌ అశ్విన్‌ల (Nag Ashwin)కాంబినేషన్ లో రూపొంది మెగా హిట్  సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)ని ఏకి పారేసారు. భారతంలో ఉన్నది వేరే.. తీసింది వేరే అంటూ మండిపడ్డారు. ఇప్పుడాయన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ గరికపాటి ఏమన్నారు.   చూద్దాం. 

Kalki 2898 AD

ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ కల్కి జూన్ 27న విడుదలై  బాక్సాఫీస్ ను షేక్ చేసింది. వైవిధ్యమైన బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను వేరే యూనివర్శ్ కు తీసుకువెళ్లింది. ప్రధానంగా కథను మోసింది అశ్వథ్థామ పాత్రధారి అయిన అమతాబ్ బచ్చన్ అయినా.. ప్రభాస్ ఛరిష్మాతోనే ఓపెనింగ్స్ వచ్చాయనేది నిజం.  కమల్ హాసన్, దీపికా పదుకోణ్, శోభన, పశుపతి, దిశా పటానీ వంటి భారీ తారాగణం కూడా ఉండటంతో ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ లా అనిపించిందీ మూవీ. 

Latest Videos


Kalki

కల్కి  సినిమా ప్రారంభంలోనూ, చివర్లోనూ వచ్చిన కురుక్షేత్రం ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. అయితే టికెట్ రేట్ భారీగా ఉండటంతో మళ్లీ మళ్లీ చూడాలనుకున్న ప్రేక్షకులు కాస్త వెనక్కి తగ్గారు. అయితేనేం ఇప్పుడు ఓటిటిల్లో రిపీట్ మోడ్ లో చూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో  అర్జునుడు, కర్ణుడు పాత్రలు వాటి మధ్య సన్నివేశాల గురించి తెగ డిస్కషన్స్ నడిచాయి. అర్జునుడు గొప్ప అని కొందరు లేదులేదు కర్ణుడే గొప్ప అని మరికొందరు వాదించుకున్నారు.  అయితే ఆ టైమ్ దాటింది. ఇప్పుడు ఇంతకాలానికి  ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు 'కల్కి' సినిమాపై విమర్శలు చేసి మళ్లీ సినిమాని వార్తల్లోకి తెచ్చారు.

Kalki 2898 AD


 రీసెంట్ గా  వినాయక చవితి సందర్భంగా గరికపాటి ప్రవచనాలు చెప్పారు. మాటల సందర్భంగా 'కల్కి'  గురించి ప్రస్తవన వచ్చేసరికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మహాభారతంలో ఉన్నది వేరు సినిమాలో చూపించింది వేరు అని చెప్పారు. అశ్వద్ధామ, కర్ణుడిని హీరోలుగా చూపించడమేంటో తనకు అస్సలు అర్థం కాలేదని కౌంటర్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.


ఇంతకీ గరికపాటి వీడియోలో ఏముంది?

'కర్ణుడు ఎవరో తెలియకపోతే 'కల్కి' సినిమాలో చూపించినవాడే కర్ణుడు. మనేం చేస్తాం. సినిమావోళ్లు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు అందులో చూపించింది వేరు. అశ్వద్ధామ, కర్ణుడు అర్జెంట్‌గా హీరోలైపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లేదు. బుర్రపాడైపోతుంది. పైగా మహాభారతమంతా చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వద్ధామ కాపాడాడు. అశ్వద్ధామని కర్ణుడు ఎప్పుడూ ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వద్ధామ మహావీరుడు. ఇక్కడేమో 'ఆచార్య పుత్ర ఆలస్యమైంది' అని డైలాగ్ పెట్టారు. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ వెయ్యి రూపాయలు ఎక్కువిస్తే డైలాగ్ రాసేవాడు రాసేస్తాడు కదా' అని గరికపాటి అన్నారు. 
 


 ఇక గరికపాటి కామెంట్స్ పై కొందరు తిరిగి కామెంట్స్ చేసున్నారు. గతంలో వచ్చిన పౌరాణిక గాధలు సైతం వాస్తవికతకు ఆమడ దూరంలో ఉంటాయి అని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నాగ్‌ అశ్విన్‌ కూడా అలానే సినిమాను తీశారు అని చెబుతున్నారు. సినిమాటిక్‌ లిబర్టీ వాడారు అని  అంటున్నారు. ఈ క్రమంలో  దీనికి సమాధానం సినిమా టీమ్‌ నుండి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విమర్శల నేపథ్యంలో రెండో పార్టులో భారతాన్ని చూపించే విషయంలో జాగ్రత్త పడతారా? లేక ఇలానే చేస్తారా? అనేది మరో చర్చగా మారింది.

click me!