`పుష్ప 2` ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా? నిర్మాతలకు డబుల్‌ బొనాంజా !

First Published | Dec 21, 2024, 10:48 PM IST

 `పుష్ప 2 `సినిమా ఓటీటీ హక్కులను ఏ సంస్థ ఎంతకు కొనుగోలు చేసింది, ఎంతకి అమ్ముడు పోయాయనేది తెలుసుకుందాం. 

పుష్ప 2 ఓటీటీ రైట్స్

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సినిమా రెండో భాగం దాదాపు మూడేళ్ల తర్వాత డిసెంబర్ 5న విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన `పుష్ప 2: ది రూల్` విడుదలకు ముందే రూ.1085 కోట్ల వరకు వసూలు చేసింది. థియేట్రికల్‌ రైట్స్, ఓటీటీ రైట్స్ రూపంలో భారీగానే రాబట్టుకున్నారు నిర్మాతలు. 

పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ కలెక్షన్

`పుష్ప 2` విడుదలై 2 వారాలు అవుతుంది. మూడో వారం రన్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1500 కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. నార్త్ లో సినిమాకి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. 


సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటన అదుర్స్ అని అంటున్నారు. పుష్ప 1: ది రైజ్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌కు ఈ సినిమా కూడా జాతీయ అవార్డు తెచ్చిపెడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కానీ బన్నీ చుట్టూ వివాదాలు వెంటాడుతున్న నేపథ్యంలో అది డౌటే అని టాక్‌. 

పుష్ప 2 ది రూల్

ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ కి సంబంధించిన వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.  నెట్‌ఫ్లిక్స్ సంస్థ పుష్ప 2 సినిమా ఓటీటీ హక్కులను రూ.270 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇక విడుదలకు సంబంధించిన ప్లాన్‌ జరుగుతుంది. జనవరి మొదటి వారంలోనే విడుదల అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ 56 రోజుల తర్వాతనే రిలీజ్‌ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అంటే జనవరి ఎండింగ్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోతుందని చెప్పొచ్చు. 

Latest Videos

click me!