ఐదుగురుమాత్రమే... చీఫ్ కంటెండర్స్.. హౌస్ లో ఉన్నవారి కోసం షర్ట్స్ వస్తుంటాయి. ఒక్కొక్కరి షర్ట్ విడిగా గ్యాప్ తో విసిరేస్తారు. దాన్ని చింపకుండా కాపాడుకోవాలి. అలా బసర్ మోగేంత వరకూ కాపాడుకుంటే.. వారు పోటీదారులవుతారు. ఈక్రమంలో ఎవరైనా ఇష్టంలేనివారి షర్ట్ చింపేయవచ్చు. అయితే మొదట ప్రేరణతో స్టార్ట్ అయ్యింది.
ప్రేరణ, గౌతమ్, తేజ, అవినాష్, యష్మి, పృధ్వి, నబిల్, విష్ణు ప్రియ టీషర్ట్స్ రాగా అందులో పృధ్వి, తేజ, విష్ణు ప్రియా, యష్మి టీ షర్ట్స్ మాత్రమేకాపాడుకోగలిగారు. మరీ ముఖ్యంగా పృధ్వీకి, విష్ణు ప్రియకు, తేజ కు నబిల్ సపోర్ట్ చేశాడు. యష్మికి కూడా సపోర్ట్ గానిలిచాడు. అయితేనబిల్ రేసులో లేకుండా చేయడం కోసం నిఖిల్, ప్రేరణ, రోహిణి పనికట్టుకుని టీషర్ట్ ను చించేశారు.