ఫ్యాన్స్ కి ప్రభాస్‌ న్యూ ఇయర్‌ సందేశం, మనల్ని ప్రేమించే మనుషులున్నారంటూ ఎమోషనల్‌ వర్డ్స్

First Published | Dec 31, 2024, 6:34 PM IST

ప్రభాస్‌ తన అభిమానులకు, తెలుగు ప్రజలకు సందేశాన్నిచ్చారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఆయన తనదైన స్టయిల్‌లో సందేశాన్నివ్వడం విశేషం. 
 

ప్రభాస్‌ సినిమాల ద్వారానే పలకరిస్తుంటారు. ఆయన తన సినిమాల సమయంలో తప్ప మరెప్పుడూ బయట కనిపించరు. చాలా రేర్‌గా ఏదైనా చిన్న సినిమాలకు సపోర్ట్ చేసే విషయంలోనే కనిపిస్తుంటారు. చాలా వరకు పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌కే ప్రయారిటీ ఇస్తారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు. కొత్త ఏడాది సందర్బంగా అభిమానులకు, తెలుగు ప్రజలకు సందేశం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సరికొత్త లుక్‌లో అలరించారు. 
 

ప్రభాస్‌ ప్రజల్లో డ్రగ్స్ అవేర్‌నెస్‌ క్రియేట్‌ చేయడానికి ముందుకు రావడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు, కొత్త ఏడాది సందర్భంగా ఆయన ఈ మంచి కార్యక్రమం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోతాహంతో ప్రభాస్‌ డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రజల్లో, అభిమానుల్లో అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ప్రభుత్వ సారథ్యంలో ఓ వీడియోని విడుదల చేశారు. ప్రజల్లో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ ఇన్‌స్పైర్‌ చేసే మాటలు చెప్పారు.

read more:రాజేంద్రప్రసాద్‌ నాకు సినిమా రాకుండా అడ్డుకున్నాడు.. నటి దివ్యవాణి సంచలన ఆరోపణలు


`లైఫ్ లో మనకు బోలెడన్నీ ఎంజాయ్ మెంట్స్ ఉన్నాయి. కావల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు మనకు ఉన్నారు. ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. సే నో టూ డ్రగ్స్. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే 8712671111 నెంబర్ కు ఫోన్ చేయండి. డ్రగ్స్ కు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది` అని తెలిపారు ప్రభాస్‌. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 

కొత్త ఏడాది సందర్భాన్ని పురస్కరించుకుని, 31 సెల్రేషన్స్ ని పురస్కరించుకుని ఆయన అభిమానులకు ఈ సందేశం ఇవ్వడం విశేషం. డిసెంబర్‌ 31న(నేడు) రోజు చాలా మంది యువత పార్టీలు, ఎంజాయ్‌మెంట్‌ పేరుతో ఆల్కహాల్‌, డ్రగ్స్ తీసుకుంటుంటారు. డ్రగ్స్ కి అలవాటు అవుతుంటారు.

ఈ క్రమంలో ప్రభాస్‌ ఈ సందేశం ఇవ్వడం విశేషం. ఇది ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్‌ సరికొత్తగా కనిపిస్తున్నారు. స్లిమ్‌ లుక్‌లో ఆయన కనిపించడం విశేషం. ఫ్యాన్స్ కి ఈ రూపంలో అయినా కనిపించడంతో వారంతా ఫుల్‌ హ్యాపీ అవుతున్నారు. 

ఇక ప్రస్తుతం ప్రభాస్‌ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పుడు `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ హర్రర్‌ కామెడీ చిత్రమిది. ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్‌ కాబోతుంది. ప్రభాస్‌ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్‌ చేస్తున్న హర్రర్‌ కామెడీ మూవీ కావడం విశేషం.

మరి సినిమా ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు ప్రభాస్‌.. హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా(ఫౌజీ) చేస్తున్నారు. సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్‌`, `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాల్లో నటించాల్సి ఉంది. దీంతోపాటు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌ లో మరో రెండు సినిమాలు చేయాల్సి ఉంది. 

also read: `మార్కో` మూవీ తెలుగు రివ్యూ

read more: హరీష్‌ శంకర్‌కి పవన్‌ చురకలు.. డేట్స్ ఇస్తే కథ కూడా రెడీ చేయలే, `హరిహర వీరమల్లు`,`ఓజీ` రిలీజ్‌పై క్లారిటీ

Latest Videos

click me!