ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. సినిమాకు 200 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు కల్కీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి.. దాదాపు 23 ఏళ్లకు పైగా అవుతోంది. ఈశ్వర్ సినిమాతో ఆయన టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యాడు.
ఈసినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి నటించింది. ఆమె కూడా హీరోయిన్ గా సినిమాలు మానేసి పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యింది. తెలుగులో కొన్ని షోస్ కు జడ్జిగా వ్యవహరిస్తోంది. సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు శ్రీదేవి.
పుష్ప సీక్వెల్ మూవీతో అంతకు మించి అంటున్నాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో జాతీయ అవార్డ్ కూడా సాధించాడు బన్నీ. ఇక పుష్ప2 తో ఆస్కార్ మీద కన్నేశాడు. అందుకు తగ్గట్టుగా సుకుమార్ తో కలిసి కష్టపడుతున్నాడు. ఈక్రమంలో డిసెంబర్ లో పుష్ప2 రిలీజ్ కాబోతోంది. ఇక అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రీ.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అల్లు అర్జున్ స్కూల్ పిల్లాడిలా నటించి మెప్పించాడు. ఈమూవీలో బన్నీ సరసన హీరోయిన్ గా అతిథి అగర్వాల్ నటించి మెప్పించింది. ఆమె దిగవంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు. ఈసినిమా తరువాత మరో రెండు మూడు సినిమాలు చేసిన అతిథి అగర్వాల్.. ఆతరువాత కనిపించలేదు.
NTR Birthday
నందమూరి నట వారసత్వం తీసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎంత వారసత్వంతో వచ్చినా..టాలెంట్ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం కష్టం. అలాగే తారక్ కూడా కెరీర్ బిగినింగ్ లో ఎంతో కష్టపడ్డాడు. నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఎన్టీఆర్. అయితే ఈసినిమా పెద్దగా ఆడలేదు.
ఈసినిమా తరువాత చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ మాత్రం ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది. అయితే నిన్ను చూడాలని సినిమాలో తారక్ జోడీగా నటించింది హీరోయిన్ రవీనా రాజ్ పుత్. ఈహీరోయిన్ ఈసినిమా తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. అసలుఆమె సినిమాలే చేసినట్టు కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది బ్యూటీ.
మెగా వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఆస్కార్ రేంజ్ కు ఎదిగాడు. త్వరలో గేమ్ ఛేంజర్ మూవీతో మెగా అభిమానులను అలరించబోతున్నాడు చరణ్. ఇక ఈ హీరోను చాలా గ్రాండ్ గా టాలీవుడ్ కు పరిచయం చేశాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.
చిరుత సినిమాతో రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈసినిమాలో హీరోయిన్ గా నటించింది ముంబయ్ భామ..నేహా శర్మ. బాలీవుడ్ లో ప్రస్తుతం కాస్త యాక్టీవ్ గా ఉన్న ఈబ్యూటీ తెలుగులో చరణ్ సినిమా తరువాత నటించలేదు. స్టార్ హీరోయిన్ స్టాయిని కూడా అందుకోలేదు బ్యూటీ.
ఇక బాలనటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తండ్రి కృష్ణతో కలిసి చాలా సినిమాల్లో నటంచి మెప్పించాడు. బాలనటుడిగా చాలా సినిమాల్లో కనిపించిన మహేష్.. 1999 లో హీరోగా మారాడు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన రాజకుమారుడు సినిమాతో ఆయన హీరోగా మారాడు.
ఈసినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ.. సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింట నటించింది. ఆమె బాలీవుడ్ లో ఎంత పెద్ద హీరోయినో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఆమె అక్కడ ఫుల్ యాక్టీవ్ గానే ఉంది. ఇక మహేష్ బాబు ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అన్న చిరంజీవి వదిన సురేఖ ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. ఇండస్ట్రీలో పవన్ స్టార్ రేంజ్ కు ఎదిగారు. ఇక రాజకీయాల్లో కూడా తన విజయ పరంపర కొనసాగిస్తూ.. డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చారు వపన్ కళ్యాణ్. సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న పవన్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తేరంగేట్రం చేశాడు.
ఈసినిమా పెద్దగా ప్రభావం చూపించకపోయినా..పర్వాలేదు అనిపించింది. అయితే ఈమూవీలో పవన్ సరసన హీరోయిన్ గా అక్కినేని నాగేశ్వరావు మనవరాలు.. హీరో సుమంత్ చెల్లెలు సుప్రియ నటించింది. ఇక ప్రస్తుతం సుప్రియా ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతోంది.