అలియా భట్ నుండి దీపికా పదుకొనే వరకు..: యాక్టింగ్ కాకుండా ఇంకేం చేస్తున్నారో తెలుసా?

First Published | Sep 12, 2024, 2:51 PM IST

బాలీవుడ్ లో దీపికా పదుకొనె, అలీ భట్ లాంటి క్రేజీ హీరోయిన్లు ఉన్నారు. అదే విధంగా ఎలాంటి విషయాల గురించి అయిన మొహమాటం లేకుండా మాట్లాడే రిచా చద్దా, భూమి పెడ్నేకర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు.

బాలీవుడ్ లో దీపికా పదుకొనె, అలీ భట్ లాంటి క్రేజీ హీరోయిన్లు ఉన్నారు. అదే విధంగా ఎలాంటి విషయాల గురించి అయిన మొహమాటం లేకుండా మాట్లాడే రిచా చద్దా, భూమి పెడ్నేకర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్లంతా సినిమాల్లో డబ్బు సంపాదించుకోవడమే కాదు.. సంపాదించినా దాంట్లో ఎంతోకొంత సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

దీపికా పదుకొనే

2015లో, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు అవగాహన పెంచడానికి ,సహాయం అందించడానికి ఆమె లైవ్‌లవ్‌లాఫ్ ఫౌండేషన్ (LLL)ని స్థాపించారు దీపికా పదుకొనే. రోగులకు వైద్యం అందించడం, వాళ్ళకి మద్దతుగా నిలవడం లాంటి సేవ కార్యక్రమాలని దీపికా తన సంస్థ ద్వారా చేస్తోంది. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


అలియా భట్

అలియా భట్ ఒక సామాజిక వ్యవస్థాపకురాలు. ఆమె 2017లో జంతు సంక్షేమం, పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి ఒక పర్యావరణ ప్రాజెక్ట్‌గా కోఎగ్జిస్ట్‌ను స్థాపించారు. మానవులు , పర్యావరణం మధ్య సంబంధం గురించి కోఎగ్జిస్ట్ అవగాహన కల్పిస్తుంది. అలియా భట్ పర్యావరణానికి హాని కలిగించని, పిల్లలకు ఉపయోగపడే బ్రాండ్స్ ని సేవా రూపంలో అందిస్తున్నారు. 

రిచా చద్దా

రిచా చద్దా కూడా తన సోషల్ మీడియా ప్రయత్నం ది కైండ్రీ ద్వారా సేవ చేస్తున్నారు. కరోనా సమయంలో ఈ సంస్థని ఆమె లాంచ్ చేశారు. కోవిడ్ టైంలో మెడిసిన్ దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సంస్థ బాగా ఉపయోగపడింది. 

భూమి పెడ్నేకర్

తన వైవిధ్యమైన నటనకు పేరుగాంచిన భూమి పెడ్నేకర్, బాలీవుడ్‌లో అత్యంత ధైర్యంగా మాట్లాడే పర్యావరణవేత్తలలో ఒకరిగా మారారు. క్లైమేట్ వారియర్ అనే సంస్థలో భూమి పెడ్నేకర్ భాగం. బీచ్ ప్రదేశాలని స్వచ్చందంగా క్లీన్ చేయడం, పర్యావరణం పై అవగాహన పెంచడం లాంటి కార్యకలాపాలు ఈ సంస్థ ద్వారా జరుగుతాయి. 

Latest Videos

click me!