Mahesh Next Film: మహేష్‌ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్, బాక్సాఫీసు వద్ద అరాచకమే.. `పెద్ది` డైరెక్టర్‌ కాదు

Published : Jun 16, 2026, 01:25 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం `వారణాసి`తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అదిరిపోయే వార్త వైరల్‌ అవుతుంది. సంచలన దర్శకుడితో మూవీ ఫిక్స్ అయ్యిందట. 

PREV
15
వారణాసితో రూ.5000కోట్లు టార్గెట్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఓ వైపు ఇంటర్నేషనల్‌ రేంజ్‌ ఫిల్మ్ లో నటిస్తున్నారు. రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రపంచ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ, దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లే ప్లాన్‌ చేస్తున్నారు జక్కన్న. సుమారు ఐదు వేల కోట్ల కలెక్షన్లు టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్‌ కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం వైరల్‌గా మారింది. ఆయన కొత్త సినిమాకి సంబంధించిన అప్‌ డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

25
మహేష్‌ నెక్ట్స్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్‌

మహేష్‌ బాబు నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆయన ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తోన్న నేపథ్యంలో ఇప్పట్లో మరో సినిమాకి ఒప్పుకునే పరిస్థితి కష్టమనే చెప్పాలి. `వారణాసి` విడుదలయ్యాక, దాని రేంజ్‌ని బట్టి కొత్త ప్రాజెక్ట్ ని ప్లాన్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో అయినా ఇదే ప్లాన్‌ చేస్తారు. జక్కన మూవీ ఏ స్థాయికి వెళ్తుందో, దాన్ని బట్టి నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయాలనేది ప్లాన్‌ చేసుకుంటారు. కానీ ఇప్పుడు మహేష్‌ బాబు తన కొత్త సినిమా విషయంలో ముందుగానే రెడీ అవుతున్నారట.

35
సందీప్‌ రెడ్డి వంగాతో మహేష్‌ మూవీ?

మహేష్‌ నెక్ట్స్ మరో సంచలన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. నిర్మాత అనిల్‌ సుంకర ఈ కాంబినేషన్‌ని సెట్‌ చేసే పనిలో ఉన్నారు. వీరిద్దరితో సినిమా చేయాలని భావిస్తున్నారు. మహేష్‌ బాబుతో అనిల్‌ సుంకరకి మంచి రిలేషన్‌ ఉంది. పైగా మహేష్‌తో సినిమా చేయాలని సందీప్‌ రెడ్డి వంగాకి కూడా ఉంది. నిజానికి గతంలోనూ వీరి కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉంది. `యానిమల్‌` మూవీ మహేష్‌ చేయాల్సింది అంటుంటారు. అప్పుడు మిస్‌ అయిన ఈ కాంబినేషన్‌ని ఇప్పుడు మళ్లీ సెట్‌ చేసే పనిలో ఉన్నారు అనిల్‌ సుంకర.

45
మహేష్‌, సందీప్‌ మూవీ.. బాక్సాఫీసు వద్ద అరాచకం

మహేష్‌ బాబు, సందీప్‌ రెడ్డి కాంబినేషన్‌ సెట్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సందీప్‌ రెడ్డి వంగాతో సినిమా చేయడానికి మహేష్‌కి పెద్దగా సమస్య లేదు. వెంటనే ఓకే చెబుతాడు. అయితే ఇప్పుడే ఓకే చెబుతాడా అనేదే ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇదే వర్కౌట్‌ అయితే మాత్రం బాక్సాఫీసు వద్ద ఆరాచకమే చెప్పొచ్చు.  ఇదిలా ఉంటే `పెద్ది`తో విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సానా నెక్ట్స్ మహేష్‌తో డిస్కషన్‌ జరుగుతుందనే ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ పరిణామాల నేపథ్యంలో ఈ మూవీ కష్టమనే టాక్‌ వినిపిస్తోంది.

55
నెల రోజుల్లో రెండు భారీ సినిమాలు విడుదల

ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారు. `స్పిరిట్‌` పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది.  ఇదిప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. డిమ్రీ తృప్తి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది. మరోవైపు మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న `వారణాసి` వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానున్న విషయం తెలిసిందే. రెండు చిత్రాలు నెల రోజుల గ్యాప్‌తో రిలీజ్‌ కాబోతున్నాయి. బ్యాక్‌ టూ బ్యాక్‌ బాక్సాఫీసు వద్ద రణరంగమే చోటు చేసుకోబోతుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories