మహేష్‌ ఫ్యామిలీ ట్రిప్‌.. వెకేషన్‌లో ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో చూడండి.. ప్రిన్స్ ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరేమో!

Aithagoni Raju | Updated : Jul 27 2023, 01:39 PM IST
Google News Follow Us

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో ఉన్నారు. లండన్‌ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. నమ్రత, గౌతమ్‌, సితారలతోపాటు మహేష్‌ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సైతం ఈ వెకేషన్‌లో ఉన్నారు. 
 

17
మహేష్‌ ఫ్యామిలీ ట్రిప్‌.. వెకేషన్‌లో ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో చూడండి.. ప్రిన్స్ ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరేమో!

తాజాగా నమ్రత లండన్‌ వెకేషన్‌ ట్రిప్‌ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంది. ప్రతి మూమెంట్‌ని షేర్‌ చేసుకుంటుంది. డిన్నర్‌ని ఎంజాయ్‌ చేయడం, షాపింగ్‌, రిలాక్సేషన్‌, ఇలా నాన్‌స్టాప్‌గా మహేష్‌ ఫ్యామిలీ ఎంజాయ్‌ చేస్తుంది. బిజీ షెడ్యూల్‌ నుంచి రిలీఫ్‌ అవుతున్నారు. 
 

27

మహేష్‌బాబు ఫ్యామిలీతోపాటు వారి ఫ్రెండ్స్ ఫ్యామిలీలు కూడా ఈ లండన్‌ ట్రిప్‌లో ఉండటంతో వారి ఆనందంరెట్టింపు అయ్యిందని చెప్పొచ్చు. అయితే మహేష్‌ ఇలా వెకేషన్‌ ట్రిప్‌ ఫోటోలకు దూరంగా ఉంటారు. చాలా అరుదుగానే కనిపిస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన దాన్ని మరింత ఎంజాయ్‌ చేస్తున్నట్టు నమ్రత పంచుకుంటున్న ఫోటోలను చూస్తుంటే అర్థమవుతుంది. 
 

37

ప్రస్తుతం మహేష్‌ ఫ్యామిలీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నమ్రత వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా అభిమానులను ఆద్యంతం అలరిస్తున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మహేష్‌ ఫుల్‌ ఎనర్జిటిక్‌గా కనిపిస్తుండటం విశేషం. 

Related Articles

47

మహేష్‌బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్టు తెలుస్తుంది. 
 

57

అయితే సినిమా పలు మార్లు వాయిదా పడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఆర్టిస్ట్ ల డేట్స్ సమస్య, యాక్షన్‌ సీన్లు సరైన విధంగా రాకపోవడం, హీరోయిన్‌ సమస్య, ఇలా దర్శకుడు త్రివిక్రమ్‌ కి, మహేష్‌కి మధ్య గ్యాప్‌ రావడం వంటి అంశాలు ఈ సినిమాని వెంటాడుతున్నాయి. వాయిదాలకు కారణమవుతుంది. 
 

67

ఇటీవల ఈ సినిమా షెడ్యూల్‌ పూర్తయ్యింది. దీంతో గ్యాప్‌ దొరకడంతో మహేష్‌ ఫ్యామిలీతో వెకేషన్‌ వెళ్లారు. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించబోతున్నారు త్రివిక్రమ్‌. ఆ లోపు మహేష్‌ తిరిగి వచ్చే అవకాశం ఉంది.
 

77

మరోవైపు ఆయనకూతురు సితార ఇప్పటికే కిడ్‌స్టార్‌గా మారిపోయింది. ఇటీవల ఆమె ఒక ఆభరణాల సంస్థకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసింది. అది న్యూయార్క్ లోని టైమ్‌ స్వ్కైర్స్ పై ప్రదర్శించబడింది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న స్టార్‌ కిడ్‌గా నిలిచింది సితార.దీనికిగానూ ఆమె ఏకంగా కోటీ రూపాయలు పారితోషికంగా తీసుకుందట. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos