కృష్ణ రెండవ భార్య విజయనిర్మల 2019 జూన్ 27న హార్ట్ అటాక్ తో కన్నుమూశారు. అనుకోని ఈ సంఘటన కృష్ణ కుటుంబాన్ని షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా కృష్ణ ఆమె మృతిని తట్టుకోలేకపోయారు. దశాబ్దాలుగా అర్థాంగిగా, స్నేహితురాలిగా, తోటి నటిగా, నిర్మాతగా ఆయనకు ప్రతి విషయంలో విజయ నిర్మల తోడున్నారు.