MSG 41 Days Collections: `మన శంకర వర ప్రసాద్‌ గారు` రేర్‌ మైల్‌ స్టోన్‌.. ఓటీటీలోకి వచ్చాక కూడా చిరు మూవీ జోరు

Published : Feb 22, 2026, 12:34 PM IST

చిరంజీవి, నయనతార జంటగా అనిల్‌ రావిపూడి రూపొందించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ ఓటీటీలోకి వచ్చాక కూడా థియేటర్లలో సత్తా చాటుతోంది. ఈ మూవీకి డీసెంట్‌ నెంబర్స్ వస్తున్నాయి. 

PREV
15
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ లేటెస్ట్ కలెక్షన్లు

మెగాస్టార్‌ చిరంజీవికి చాలా రోజుల తర్వాత తన రేంజ్‌కి తగ్గ హిట్‌ పడింది. ఈ సంక్రాంతికి ఆయన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఏకంగా తెలుగులో రీజనల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.  సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు 41రోజులు పూర్తి చేసుకుంది. ఓ వైపు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నా, థియేటర్లలో రన్‌ అవుతుంది. డీసెంట్‌ కలెక్షన్లని వసూలు చేస్తోంది.  

25
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రేర్‌ మైల్‌ స్టోన్‌

విడుదలై 41 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీని అరుదైన మైల్‌ స్టోన్‌ కి చేరింది. ప్రముఖ కలెక్షన్ల సైట్‌ `సాక్నిల్క్` లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఇది రూ.300కోట్ల వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా  మూడు వందల క్లబ్‌లో చేరడం విశేషం. పాన్‌ ఇండియా మూవీస్‌ కాకుండా ఈ స్థాయి వసూళ్లని రాబట్టిన తొలి సినిమాగా `మన శంకర వర ప్రసాద్‌ గారు` రికార్డు సృష్టించింది. అరుదైన మైల్‌ స్టోన్‌ని టచ్‌ చేసిందని చెప్పొచ్చు.

35
300కోట్ల క్లబ్‌లో `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ

వరల్డ్ వైడ్‌గా ఇది రూ.300.3కోట్లు వసూలు చేయగా, ఇండియా నెట్‌ 217.2కోట్లుగా ఉంది. ఇండియా గ్రాస్‌ రూ.257కోట్లు, ఓవర్సీస్‌లో రూ.43కోట్లు రాబట్టింది (చిత్రం బృందం మాత్రం ఇది రూ.380కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించింది). ఈ మూవీకి రూ.120కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యింది. దాదాపు రూ.60-70 కోట్లకు మధ్య లాభాలు సాధించింది. బయ్యర్లకి, ఎగ్జిబిటర్లకి లాభాల పంట పండించిందని చెప్పొచ్చు. అయితే ఓటీటీలోకి వచ్చిన సినిమా థియేటర్లో ఆడటం చాలా అరుదు. కానీ చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మాత్రం థియేటర్లలో ఇంకా డీసెంట్‌ నెంబర్స్ ని రాబట్టడం విశేషంగా చెప్పొచ్చు.

45
ఈ శనివారం టీవీలోకి `మన శంకర వర ప్రసాద్‌ గారు` టెలికాస్ట్

`మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ గత వారం జీ 5 ఓటీటీలోకి వచ్చింది. వచ్చిన 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌ని సాధించింది. 200 మిలియన్లకుపైగా వ్యూస్‌ మినిట్స్ ని సాధించింది. ఇప్పుడు వారం గడుస్తున్న టాప్‌లో నడుస్తోంది. ఇప్పుడు టాప్‌ 3లో  ఉండటం విశేషం. ఇక వచ్చే వారం ఇది టీవీలోకి రాబోతుంది. ఈ నెల 28న(శనివారం) జీ తెలుగులో సాయంత్రం 5.30లకు టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని జీ వాళ్లు ప్రకటించారు. మరి అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో దుమ్మురేపిన ఈ చిత్రం టీవీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.  

55
`మన శంకర వర ప్రసాద్‌ గారు` ఎలా ఉందంటే?

చిరంజీవి హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌ చేశారు. చిరు కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. సంక్రాంతి పండక్కి మంచి ఫ్యామిలీ, ఫన్‌ కంటెంట్‌తో ఈ మూవీని రూపొందించారు అనిల్‌. మహిళా ప్రేక్షకులకు, చిరంజీవి అభిమానులకు, అలాగే చిన్నపిల్లల్ని అలరించేలా ఈ మూవీ ఉండటంతో అన్ని వర్గాల ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories