చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న SSMB 28 మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్రత్యేకమైన సెట్స్ పై మహేష్ పై యాక్షన్ సన్నివేశాలతో పాటు ఇతర సన్నివేశాల చిత్రీకరణ జరిపినట్లు సమాచారం. అయితే మొదలయ్యాక అర్థాంతరంగా షెడ్యూల్ ఆగిపోయింది. దానికి కారణం యాక్షన్ కొరియోగ్రాఫర్ తో వచ్చిన సమస్య కారణంగా చిత్రీకరణ ఆపారంటూ ప్రచారం జరిగింది.