Mahesh Babu: మరదలిని మోసం చేసిన మహేష్ బాబు .. నమ్రత, శిల్పల సీక్రెట్ ప్లాన్ ఏంటో తెలుసా?

Published : Jul 08, 2026, 04:40 PM IST

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సైలెంట్ గా కనిపిస్తాడు కానీ.. ఆయన అల్లరి మామూలుగా ఉండదు. ఓ సారి మహేష్ బాబు ఆయన మరదలు శిల్పా శిరోద్కర్ ను ఆటపట్టించడం కోసం ఏం చేశాడో తెలుసా?

PREV
14
మహేష్ బాబు సైలెంట్ సెటైర్లు..

సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు నటనతోనే కాదు, తన అల్లరితో, సెన్సాఫ్ హ్యూమర్‌తోనూ అందరినీ నవ్విస్తుంటారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులతో ఆయన చేసే హడావిడి నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతుంటుంది. తాజాగా మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్, అలాగే నమ్రత సోదరి (మరదలు) శిల్పా శిరోద్కర్ మధ్య జరిగిన ఒక సరదా సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

24
భాష రాదని మరదిలితో మహేష్ బాబు ప్రాంక్

మహేష్ బాబు భార్య నమ్రత, మరదలు శిల్పా శిరోద్కర్ ఇద్దరూ ముంబైకి చెందినవారనే సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నమ్రత హైదరాబాద్‌లోనే ఉంటూ తెలుగు నేర్చుకున్నారు. కానీ శిల్పా శిరోద్కర్‌కు తెలుగు అంతగా రాదు. ఇదే విషయాన్ని ఆసరాగా తీసుకుని మహేష్ బాబు ఒకసారి సరదాగా శిల్పను ఆటపట్టించారట. శిల్పకు తెలుగు భాష సరిగ్గా రాకపోవడంతో, ఆయన కొన్ని తెలుగు పదాలకు తప్పుడు అర్థాలు చెప్పి ఆమెను కాసేపు మోసం చేశారట. మహేష్ చెప్పినదాన్ని నిజమే అనుకుని శిల్ప అమాయకంగా నమ్మేయడం, ఆ తర్వాత అసలు విషయం తెలిసి నవ్వుకోవడం జరిగిందట.

34
రివర్స్ ప్లాన్ వేసిన నమ్రత, శిల్ప

మహేష్ బాబు తనతో అలా ఆటపట్టించడంతో, శిల్పా శిరోద్కర్ కూడా ఊరుకోలేదు. దానికి రివెంజ్ తీర్చుకోవడానికి నమ్రతతో కలిసి ఒక సీక్రెట్ ప్లాన్ వేసింది. మహేష్ బాబు ముందే నమ్రత, శిల్ప ఇద్దరూ కలిసి తమ మాతృభాష అయిన 'మరాఠీ, హిందీలో మహేష్‌కు అర్థం కాకుండా కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారట."నువ్వు మాకు తెలుగు రాదని ఆటపట్టిస్తే.. నీ ముందే నీకు అర్థం కాని భాషలో మేము రహస్యాలు మాట్లాడుకుంటాం" అన్నట్లుగా ఆ ఇద్దరు సిస్టర్స్ మహేష్‌ బాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారట. మహేష్ కు ముందే మరాఠి వచ్చినా.. కావాలని మాట్లాడకుండా.. సైలెంట్ గా ఉండేవాడట. ముందే వాళ్లిద్దరూ సీక్రెట్స్ మాట్లాడుకుంటూ ఉంటే, ఆయన మాత్రం ఏం అర్థం కానట్టు నటించి ఆతరువాత ఒకసారి మరాఠీలో స్పందించారట. దాంతో షాక్ అయిన శిల్పా.. ఇన్నాళ్లు మమ్మల్ని మరాఠీ రాదని చెప్పి మోసం చేస్తారా అని నవ్వుకున్నారట. ఈ సరదా ఫ్యామిలీ సీక్రెట్‌ను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు శిల్పా.

44
సంబరపడుతున్న అభిమానులు..

ఈ విషయం బయటకు రావడంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. స్క్రీన్ మీద ఎంతో గంభీరంగా కనిపించే మహేష్ బాబు, ఇంట్లో మాత్రం తన భార్య, మరదలితో ఎంత సాధారణంగా, అల్లరిగా ఉంటారో దీన్ని బట్టి అర్థమవుతోందని కామెంట్లు పెడుతున్నారు. భాష ఏదైనా.. కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న అల్లర్లు, సీక్రెట్స్ ఉంటేనే ఆ బంధం మరింత అందంగా మారుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories