మహేష్ రూపాయి కూడా తీసుకోవడం లేదు.. రాజమౌళి చిత్రానికి నో రెమ్యునరేషన్, మ్యాటర్ పెద్దదే

Published : Jan 27, 2024, 10:02 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో చిత్రానికి ముందస్తు సన్నాహకాలు జోరందుకుంటున్నాయి. వీలైనంత త్వరలో షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. 

PREV
16
మహేష్ రూపాయి కూడా తీసుకోవడం లేదు.. రాజమౌళి చిత్రానికి నో రెమ్యునరేషన్, మ్యాటర్ పెద్దదే

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో చిత్రానికి ముందస్తు సన్నాహకాలు జోరందుకుంటున్నాయి. వీలైనంత త్వరలో షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ అయినట్లు విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. 

 

26

ఇప్పుడిప్పుడే ఈ చిత్ర ఫైనాన్స్ వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఏంటంటే మహేష్ బాబు ఈ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనేది ఆసక్తిగా మారింది. రాజమౌళి రెండేళ్ల వరకు మహేష్ బాబు డేట్స్ బ్లాక్ చేశారట. రెండేళ్ల పాటు డేట్స్ బ్లాక్ చేయడం అంటే.. అది కూడా సూపర్ స్టార్ డమ్ ఉన్న మహేష్ లాంటి హీరోకి భారీగా రెమ్యునరేషన్ ముట్టజెప్పాలి. ఇది కాస్త జక్కన్నని కలవర పెడుతున్న అంశం అట. 

 

36

రెండేళ్ల డేట్స్ కి తగ్గట్లుగా రెమ్యునరేషన్ అంటే సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది. అయితే మహేష్ బాబు 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ల పాటు కాల్ షీట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. కానీ రాజమౌళి, తన కెరీర్ లో ఈ చిత్రం ఎపప్పటికీ నిలిచిపోయే చిత్రం కావాలనేది మహేష్ కోరిక. అవుట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనేది మహేష్ ఆలోచన. 

 

46

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు మహేష్ కి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఈ చిత్రానికి పార్ట్నర్ గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ నిర్మాత అయినప్పటికీ ఫైనాన్స్ వ్యవహారాలన్నీ జక్కన్నే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

 

56

మహేష్ బాబు కూడానా రాజమౌళి ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా పూర్తయ్యే వరకు తనకు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ ఇవ్వక్కర్లేదని మహేష్ అంటున్నారట. సో ఈ చిత్రానికి మహేష్ బాబు పార్ట్నర్ గా అఫీషియల్ గా ప్రొడ్యూసర్ అయినట్లే అని అంటున్నారు. 

 

66

హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో రాజమౌళి అమెజాన్ అడవుల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడిగా మహేష్ బాబు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కి గురిపెట్టి కొట్టిన జక్కన్న ఈ చిత్రంతో ఇంకెన్ని అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంటారో చూడాలి. 

 

click me!

Recommended Stories