అందాల పోటీ పేరుతో అగ్రిమెంట్, నెమ్మదిగా అందులోకి దింపేస్తారు.. పొలిమేర 2 హీరోయిన్ కి ఇలాంటి అనుభవమా

Published : Jan 27, 2024, 07:25 PM ISTUpdated : Jan 27, 2024, 07:45 PM IST

వృత్తి రీత్యా డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల నటిగా మారి వస్తున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. విరూపాక్ష చిత్రంలో కూడా కామాక్షి నటించింది. సోషల్ మీడియాలో ఘాటైన ఫోజులతో రెచ్చిపోయే కామాక్షి భాస్కర్ల కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. 

PREV
16
అందాల పోటీ పేరుతో అగ్రిమెంట్, నెమ్మదిగా అందులోకి దింపేస్తారు.. పొలిమేర 2 హీరోయిన్ కి ఇలాంటి అనుభవమా

క్షుద్ర పూజలు, తంత్రాలు లాంటి వైవిధ్యమైన అంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. విరూపాక్ష, పొలిమేర 2, మంగళవారం లాంటి చిత్రాలు ఇలాంటి అంశలతోనే వచ్చి విజయం అందుకున్నాయి. ముఖ్యంగా చాలా చిన్న చిత్రంగా గత ఏడాది నవంబర్ లో విడుదలైన పొలిమేర 2 చిత్రం మంచి విజయం సాధించింది. 

26

ఈ చిత్రంలో  సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవివర్మ లాంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల నటిగా మారి వస్తున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. విరూపాక్ష చిత్రంలో కూడా కామాక్షి నటించింది. సోషల్ మీడియాలో ఘాటైన ఫోజులతో రెచ్చిపోయే కామాక్షి భాస్కర్ల కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. 

36

కామాక్షి కేవలం నటి, డాక్టర్ మాత్రమే కాదు.. మోడల్ కూడా. ఆమె మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. అయితే అక్కడ కామాక్షికి చేదు అనుభవం ఎదురైందట. తాజాగా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు రివీల్ చేసింది కామాక్షి. ఎంబిబిఎస్ చదువుతున్నప్పుడే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని కోరికగా ఉండేదట. 2018లో ముందుగా మిస్ తెలంగాణగా ఎంపికైందట. అయితే మిస్ ఇండియాలో రాణించాలంటే.. చాలా చబ్బీగా ఉన్నావు ఇలా ఉంటే కుదరదు అని హెచ్చరించారట. దీనితో కామాక్షి కాష్టపడి వెయిట్ తగ్గిందట. 

46

దీనితో ఆమె టాప్ 15 లో చోటు దక్కించుకుంది. అయితే అక్కడ టాస్క్ లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగారట. టైటిల్ కాకపోతే ఎలా ఫీల్ అవుతావు అని అడిగారు ? దీనికి నిజాయతీగా.. ఇక్కడితో లైఫ్ ఆగిపోదు కదా మూవ్ ఆన్ అవుతాను అని చెప్పింది కామాక్షి. కానీ అక్కడున్న వారికి ఆ సమాధానం నచ్చలేదు. 

56

మోడల్ గా మేము చెప్పిన అగ్రిమెంట్ కి సంతకం చేస్తే నీ లైఫ్ బావుంటుందని.. లేకపోతే ఇక్కడితో నీ కెరీర్ ముగిసిపోతుందని నిర్వాహకులు బెదిరించారట. అది తనని ఎంతగానో భాదించినట్లు కామాక్షి పేర్కొంది. ఎన్నో కలలతో వచ్చిన వారిని ఇలా నెమ్మదిగా మోడల్స్ గా మార్చేసి కెరీర్ లేకుండా చేస్తున్నారు అని పేర్కొంది. 

66

పేరుకు మాత్రమే అందాల పోటీ.. కానీ వాళ్ళకి అవసరమైన అగ్రిమెంట్ రాయించుకుని మోడలింగ్ లోకి దింపే ప్రయత్నం చేస్తారు. దీనితో అక్కడ నచ్చక అపోలోలో డాక్టర్ గా జాయిన్ అయ్యా. కానీ అక్కడ కూడా లైఫ్ బోర్ కొట్టేసింది. దీనితో నటనవైపు వచ్చినట్లు కామాక్షి పేర్కొంది. 

click me!

Recommended Stories