అదేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. వెంకీ, మహేష్ బాబు కలిసి నటించిన `సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు` మూవీలో నటించారు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. అయితే ఇందులో వెంకీ మొదట హీరోగా ఎంపికయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు చేయాల్సిన పాత్రకి పవన్‌ని అప్రోచ్ అయ్యారట.
కానీ ఆయన నో చెప్పారు. ఆ తర్వాత మహేష్ వద్దకు వెళ్లగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేష్ ఓకే చెప్పాడనే కారణంగానే మహేష్ ఈ మూవీ చేశారు. వీరికి తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారు. అయితే ముందు ఈ పాత్ర కోసం రజనీకాంత్‌ని అడిగాడట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కానీ ఆ సమయంలో రజనీ ఆరోగ్యం సరిగా లేదు, దీంతో చేయలేనని చెప్పాడట.
మొత్తంగా పవన్ మంచి బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇదే కాదు `పోకిరి` మూవీ కూడా ముందు పవన్ వద్దకు వెళ్లిందట. కానీ ఆయన రిజెక్్ట చేశాడని, తర్వాత మహేష్ వద్దకు వెళ్లింది. అది అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.