మహేష్ బాబు తనకి హిట్స్ ఇచ్చిన దర్శకులని రిపీట్ చేస్తుంటారు. త్రివిక్రమ్, శ్రీనువైట్ల, పూరి జగన్నాధ్, గుణశేఖర్, కొరటాల శివ ఇలా కొందరు దర్శకులతో మహేష్ బాబు రిపీట్ గా సినిమాలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు దూకుడు చిత్రంలో నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో వీళ్లిద్దరి కాంబినేషన్ రిపీట్ అయింది మరోసారి ఆగడు చిత్రం చేశారు. ఇది మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచింది.