నేను ఇండో అమెరికన్ కుటుంబానికి చెందిన అమ్మాయిని
నేను హిందీ, తెలుగు, గుజరాతీ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నేను జన్మించింది అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో. నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చారు. వెంటనే వారు అమెరికా పౌరులుగా మారారు. USAలో నా యూనివర్సిటీ విద్యను పూర్తి చేసిన తర్వాత, నేను నటి గా, కొరియోగ్రాఫర్‌గా, నర్తకిగా కళారంగంలో వృత్తిని కొనసాగించాను. ఈ రంగంలో చాలా పని చేసిన తర్వాత, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలను అందుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
నా రక్తంలో లోతుగా భారతీయత నెలకొంది. సోషల్ మీడియాని విద్వేషం కోసం కాకుండా ఐక్యత కోసం ఉపయోగించండి అంటూ ఇమాన్వి తనని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చింది.