ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు స్టార్స్ గా పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు సమానమైన ఇమేజ్, ఫాలోయింగ్ ఒక్క కృష్ణకు మాత్రమే దక్కింది. కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. ఆయన ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్.
ఫస్ట్ కౌ బాయ్ చిత్రం కృష్ణ చేశారు. తెలుగులో ఫస్ట్ సోసియో కలర్, ఫస్ట్ సినిమా స్కోప్ చిత్రాలు కృష్ణవే.ఆయన ద్విపాత్రాభినయం చేసిన సింహాసనం ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. భారీ బడ్జెట్ కావడంతో ఆయనే స్వయంగా నిర్మించాడు. సింహాసనం బ్లాక్ బస్టర్ మూవీ కాగా.. కృష్ణ దర్శకత్వం వహించడం మరొక విశేషం.