సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకే ఏడాది అన్న, తల్లి, తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కొద్దిరోజుల కింద తండ్రి కృష్ణ చనిపోవడం పట్ల తాజాగా స్పందించారు. కృష్ణను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబును ఈ ఏడాది తీరని శోకసంద్రంలోకి నెట్టేసిందనే చెప్పాలి. మహేశ్ ఇంట వరుస విషాదాలు నెలకొనడంతో మానసికంగా బలాన్ని కోల్పోతున్నారు. ఒకదాన్నుంచి కోలుకునే లోపే మరో ఘటన జరుగుతుండటంతో పుట్టెడు శోకాన్ని అనుభవిస్తున్నారు.
26
సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (Rip Krshna) ఈనెల 15న మరణించారు. ఆయన తుదిశ్వాస విడవటంతో కుటుంబీకులు, సినీ ఇండస్ట్రీలోని పెద్దలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికన నివాళి అర్పిస్తున్నారు.
36
తండ్రి కృష్ణ చనిపోయిన బాధలో ఉన్న మహేశ్ బాబు నోటమాట రాకుండా ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పదిరోజుల తర్వాత కృష్ణ మరణం పట్ల మహేశ్ బాబు స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ట్వీటర్ లో హార్ట్ ఫెల్ట్ నోట్ ద్వారా నివాళి అర్పించారు.
46
ఈ నోట్ లో.. ‘మీ జీవితం ఒక వేడుకలా సాగింది. మీ అంత్యక్రియ కూడా అదే విధంగా ముగిశాయి. మీ గొప్పతనానికి నిదర్శనమిది. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా, ధైర్యంగా మరియు డాషింగ్ గడిపారు. నాకు స్ఫూర్తినిచ్చింది.. నాలో ధైర్యం నింపింది మీరే. మిమ్మల్నే నా జీవితంలో అన్నీ మీరుగా ఉండి ఒక్కసారి విడిచిపెట్టి వెళ్లారు.
56
నేను బలంగా నమ్ముతున్నాను... ఇప్పటి నుంచి మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు నాలో ప్రకాశిస్తున్నారని నమ్ముతున్నారు. ప్రస్తుతం నాలో ఎలాంటి భయాలు లేవు. మీ దీవెనలతో మరింత ముందుకు వెళ్తాను. మిమ్మల్ని మరింతగా నగర్వపడేలా చేస్తాను. నాన్న, మై సూపర్ స్టార్’ అంటూ భావోద్వేగం అయ్యారు.
66
హార్ట్ ఫెల్ట్ నోట్ తో పాటు సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించి యంగ్ ఫొటోగ్రాఫ్ ను కూడా మహేశ్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మొన్న సూపర్ స్టార్ కృష్ణ పెళ్లి రోజు కావడంతో కూతురు మంజుల కూడా ఎమోషనల్ అయ్యింది. తల్లిదండ్రులతో తనున్న ఫొటోలను పంచుకుని కన్నీమున్నీరైంది. ఇక ఇదే ఏడాది జనవరిలో అన్న రమేశ్ బాబు, సెప్టెంబర్ లో తల్లి ఇందిరా దేవి (Indira Devi) కూడా మరణించడం బాధకారం.