సితార ఘట్టమనేని రెడ్ ట్రెండీ వేర్లో అద్భుతం చేసింది. దసరా పండగ సందర్భంగా ప్రత్యేకంగా ముస్తాబైంది. నేలకు దిగిన చందమామలా ఉన్న సితార ఫెస్టివ్ లుక్ వైరల్ అవుతుంది.
18
Sitara Ghattamaneni
రెడ్ క్రాప్ టాప్ లెహంగాలో మెరిసింది స్టార్ కిడ్ సితార. దసరా పండగ పురస్కరించుకుని ఆమె ఇలా తయారయ్యారు. ఎరుపు ధైర్యానికి, విజయానికి ప్రతీక అట. అందుకే రెడ్ కలర్ డ్రెస్ ధరించిందట సితార. తన అభిమానులకు సితార తనదైన శైలిలో దసరా శుభాకాంక్షలు చెప్పింది.
28
Sitara Ghattamaneni
11 ఏళ్లకే సితార సెలబ్రిటీ హోదా దక్కించుకుంది. అలాగే సంపాదనలో దూసుకుపోతుంది. ఇటీవల సితార ఓ ఇంటర్నేషనల్ జ్యూవెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేసింది. సితార పీఎంజే జ్యూవెలరీ బ్రాండ్ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార హోర్డింగ్స్ ప్రదర్శించారు.
38
Sitara Ghattamaneni
ప్రఖ్యాత స్ట్రీట్ లో సితార ఫోటోలు దర్శనమివ్వడంతో మహేష్ బాబు మురిసిపోయారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో స్పందించారు. 'టైం స్క్వేర్ స్ట్రీట్ లో వెలిగిపోతున్నావు. చాలా గర్వంగా ఉంది సీమటపాకాయ్. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను...' అంటూ కామెంట్ చేశారు.
Related Articles
48
Sitara Ghattamaneni
ఈ యాడ్ కి సితార కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. తన మొదటి సంపాదన ఛారిటీకి డొనేట్ చేసినట్లు సితార వెల్లడించింది. పుట్టినరోజు నాడు పేద బాలికలకు సైకిల్స్ తన సంపాదనతో కొనిపెట్టింది. ఆ బాలికల సమక్షంలో బర్త్ డే జరుపుకుంది. వారితో కాసేపు ముచ్చటించింది.
58
Sitara Ghattamaneni
ఇక సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఈ స్టార్ కిడ్ లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. దానికి కారణం ఆమె టాలెంట్ కూడా. సితార తరచుగా డాన్స్ వీడియోలు చేస్తుంటారు. అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తుంటారు. కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
68
యానీ మాస్టర్ వద్ద సితార డాన్సులు శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏమైనా సితార చిన్నప్పటి నుండి కళలపై మక్కువ పెంచుకుంటూ, వాటిని అభ్యసిస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారు.
78
త్వరలో సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. సర్కారు వారి పాట మూవీలో 'పెన్నీ' సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. పిల్లలను ప్రాణంగా ప్రేమించే మహేష్ వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తారు అనడంలో సందేహం లేదు.
88
ఒక వేళ సితార నటనను కెరీర్ గా ఎంచుకుంటే ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొడుకు గౌతమ్ మహేష్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం అనివార్యం. చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించారు.