మహేష్ గతంలో తన అభిమాన దర్శకులు ఎవరంటే శంకర్, మణిరత్నం, రాజమౌళి అని చెప్పారు. ఈ ముగ్గురు దర్శకులతో వర్క్ చేయాలని ఉన్నట్లు కూడా మహేష్ పేర్కొన్నారు. ఇక తన అభిమాన నటుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళంలో అభిమాన హీరో ఎవరు అని యాంకర్ అడగ్గా.. మహేష్ వెంటనే రజనీకాంత్ అని సమాధానం ఇచ్చారు.