షాక్: 'విశ్వం', 'మార్టిన్' చాలా చోట్ల షో లు పడలేదు, ఎందుకంటే

First Published | Oct 11, 2024, 3:16 PM IST

గోపిచంద్ నటించిన విశ్వం, మార్టిన్ అనే డబ్బింగ్ సినిమాకు మాత్రం ఈ రోజు సమస్య ఎదురైంది.  నైజాం రీజియన్‌లో  ఏ సమస్యా లేకుండా విడుదలైంది.
 

Viswam, gopichand, Martin


దసరా సందర్భంగా ఈసారి థియేటర్లలో దాదాపు అరడజనుకి పైగా సినిమాలు రిలీజయ్యిన సంగతి తెలిసిందే. గురువారం రజినీకాంత్ 'వేట్టయాన్' రిలీజ్ కాగా డివైడ్ టాక్ వచ్చింది. తెలుగులో ఓపినింగ్స్ కూడా రాలేదు. ఇక శుక్రవారం గోపీచంద్ 'విశ్వం', సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' మూవీస్‌తోపాటు 'జిగ్రా', 'మార్టిన్' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్లలోకి వచ్చేశాయి. అయితే  వాటిల్లో 'విశ్వం', 'మార్టిన్' చాలా చోట్ల షో లు పడలేదు కారణం ఏమిటనేది చాలా మందికి అర్దం కాలేదు.

Gopichand, Srinu vytla, Viswam


సినిమా రిలీజ్ అంటే ఆశామాషి కాదు. సినిమా రిలీజ్ నాటికి రకరకాల సమస్యలు ఎదురౌతూంటాయి. ఎంత పెద్ద హీరోలు కు అయినా అది తప్పదు.  దసరా సందర్భంగా శ్రీను వైట్ల, గోపీచంద్‌ల విశ్వం, ధృవ సర్జా మార్టిన్, సుధీర్ బాబు నటించిన మ నాన్న సూపర్ హీరో సినిమాలు ఈరోజు విడుదల అయ్యాయి. అయితే గోపిచంద్ నటించిన విశ్వం, మార్టిన్ అనే డబ్బింగ్ సినిమాకు మాత్రం ఈ రోజు సమస్య ఎదురైంది.  నైజాం రీజియన్‌లో  ఏ సమస్యా లేకుండా విడుదలైంది.


Viswam movie Review


కానీ కొన్ని ఏరియాల్లో  లోకల్ డిస్ట్రిబ్యూటర్లు ఇంకా బకాయిలు క్లియర్ చేయకపోవడంతో ఆంధ్రా ప్రాంతంలో సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఉత్తరాంధ్ర, పశ్చిమగోదావరి, గుంటూరు రీజియన్లలో లైసెన్సులు ఇవ్వడం లేదు. ఈ ప్రాంతాలలో మార్నింగ్ షోలు రద్దు చేయబడ్డాయి. అందుకు కారణం బకాయిలు క్లియర్ కాకపోవటమే అని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయని, అన్ని క్లియర్ అయితే మధ్యాహ్నం షోలు ప్రదర్శించబడతాయి. మరోవైపు, ధృవ సర్జా యొక్క పాన్-ఇండియన్ చిత్రం మార్టిన్ కన్నడ భాష మరియు కర్ణాటకలో మాత్రమే విడుదల అవుతోంది. 

Viswam movie Review


మార్టిన్ సినిమా కు సైతం  ఆర్థిక ఇబ్బందులతో ఇరుక్కుని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో మార్నింగ్ షోలు రద్దయ్యాయి. ప్రస్తుతానికి ఇతర భాషల డబ్బింగ్ ల రిలీజ్  గురించి క్లారిటీ లేదు. ఈ సినిమాపై ధృవ సర్జా ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమాకు ఈ రకంగా  షాక్ ఎదురైంది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన మ నాన్న సూపర్ హీరో ఎలాంటి అవాంతరాలు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యింది. సుహాస్ 'జనక అయితే గనక' సాయంత్రం ప్రీమియర్లతో విడుదల అవుతోంది. ఈ చిత్రం రేపు విస్తృతంగా విడుదల కానుంది. ఎన్టీఆర్ దేవర చిత్రం అంతటా మంచి వసూళ్లను సాధిస్తోంది మరియు వీకెండ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ని  అందజేస్తుందని భావిస్తున్నారు.
 

Viswam movie Review


విశ్వం సినిమా విషయానికి వస్తే..గోపీచంద్, శ్రీను వైట్లకు ‘విశ్వం’ మూవీ అవసరమైన పరీక్ష. వరుస ఫ్లాప్‌లలో ఉన్న డైరెక్టర్.. మరో ఫ్లాప్ లిస్ట్‌లో ఉన్న హీరోతో సినిమా చేస్తున్నాడననే సరికి ఎక్సెపక్టేషన్స్ పెద్దగా లేవు. కామెడీ ఉంటుందని నమ్మిన వారు మాత్రమే థియేటర్స్ కు ఓపినింగ్స్ ఇచ్చారు. 

శ్రీను వైట్ల విశ్వం కథని భారీ హంగులతో బాగానే ముస్తాబు చేశారు కానీ.. రొటీన్ ఫార్మేట్ తో తనకు తనే దెబ్బ కొట్టుకున్నారు  శ్రీను వైట్ల .   ఒక పాపను కాపాడటం కోసం విశ్వం చేసిన యుద్ధమే ఈ సినిమా కథ.ఈ సినిమాలో కూడా యాంటీ టెర్రర్టిస్ట్ స్క్వాడ్ కమాండర్‌ గా విశ్వంగా..గోపిచంద్ యాక్షన్ ఎపిసోడ్స్ అదరకొట్టారు కానీ కథే వెనక్కి లాగేసింది.
 

Latest Videos

click me!