మహేష్ ,రాజమౌళి చిత్రంకి బేస్ 'రామాయణం'లో ఆ ఘట్టమే ?

Published : Mar 12, 2025, 08:28 AM IST

#SSMB29: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB29 రామాయణం స్ఫూర్తితో తెరకెక్కుతోందని సమాచారం. ఇంతకీ రామాయణంల ఏ ఘట్టం ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందో చూద్దాం. 

PREV
14
 మహేష్ ,రాజమౌళి చిత్రంకి బేస్ 'రామాయణం'లో ఆ ఘట్టమే ?
Mahesh Babu And SS Rajamouli Film draws inspiration from the Hindu epic Ramayana in telugu


#SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ29. ‘#SSMB29’ వర్కింగ్‌ టైటిల్‌. చిత్రీకరణ ప్రారంభమవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. రెగ్యులర్‌ షూటింగ్‌ కొన్ని రోజుల క్రితం ఒడిశాలో మొదలైంది.

 ఈ  భారీ బడ్జెట్‌ ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ లో కథేమిటి అనేది బయిటకు రాకపోయినా , ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారు.

 మహేశ్‌బాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌లు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. ఈ క్రమంలో ఓ కొత్త కథనం మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం రామాయణంలో గొప్పదైన ఎపిసోడ్ ఆధారంగా రూపొందుతోంది అని చెప్తున్నారు. ఇంతకీ ఆ ఎపిసోడ్ ఏమిటి

 

 

24
Mahesh Babu And SS Rajamouli Film draws inspiration from the Hindu epic Ramayana in telugu


 ఈ చిత్రానికి మైథలాజికల్‌ టచ్‌ ఉందని, రామాయణంలోని కొన్ని ముఖ్య సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని, నేటి ఆధునిక కాలానికి అన్వయించి, ఈ కథను విజయేంద్రప్రసాద్‌ రెడీ చేశారని సమాచారం.  

రామాయణంలో కీలక ఘట్టమైన లక్ష్మణుడిని బ్రతికించడానికి సంజీవని కోసం హనుమంతుడి వెళ్లిన ఎపిసోడ్. ఆ  కాన్సెప్ట్‌‌ను బేస్ చేసుకుని మోడ్రన్ కాలానికి తగినట్లుగా మార్చినట్లుగా తెలుస్తోంది.
 

34
Mahesh Babu And SS Rajamouli Film draws inspiration from the Hindu epic Ramayana in telugu

ఈ కథలో కూడా ఓ ప్రాణాన్ని బ్రతికించటం కోసం సంజీవిని లాంటి మెడిసన్ వెతుకుతూ  మహేష్ బాబు  ఈ జర్నీ చేస్తాడని చెప్పుకుంటున్నారు.  కథలో కాశీ నగరానికి కూడా ప్రాముఖ్యత ఉందట.

ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సింది. దాంతో కాశీ నగరాన్ని పోలిన సెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో యూనిట్‌ ఉందని తెలస్తోంది. 

44
Mahesh Babu And SS Rajamouli Film draws inspiration from the Hindu epic Ramayana in telugu


ఇక  మహేష్ గ్లోబల్ ట్రోట్టింగ్(ప్రపంచాన్ని చుట్టే మనిషి) కాన్సెప్ట్‌తో సినిమా చేస్తున్నాడని చెప్పడంతో ఆడియెన్స్‌లో నెలకొన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరుగుతుంది. 

మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంకల కాంబినేషన్‌ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. కాగా ఈ సినిమా షూటింగ్‌లోని ఓ వీడియో బయటికొచ్చింది. దీంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలిసింది.

ఈ నెల 28 వరకు తోలోమాలి, దేవ్‌మాలి, మాచ్‌ఖండ్‌ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన లోకేషన్లలో చిత్రీకరణ జరగనుంది. తోలోమాలి పర్వతంపై భారీ సెట్‌ రూపొందించారు. కీలక పాత్ర పోషించనున్న ప్రియాంక చోప్రా మరికొన్ని రోజుల్లో షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలిసింది.
 

Read more Photos on
click me!

Recommended Stories