అసలు విషయం ఏంటంటే.. యంట్ టైగర్ ఎన్టీఆర్ గతంలో కొన్ని టీవీ షోస్ కు హోస్ట్ గా ఉన్నారు. బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి పెద్ద పెద్ద షోస్ ను ఆయన యాంకరింగ్ చేశారు. అయితే అందులో భాగంగా చాలామంది సెలబ్రిటీలు ఈషోస్ లో పాల్గొనడం జరిగింది.
ఇక అప్పుడు ఓ ఎపిసోడ్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రావడం జరిగింది. ఇక మహేష్ దొరక్క దొరక్క దొరికే సరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒ ఆట ఆడేసుకున్నారు. ఈక్రమంలోనే మహేష్ బాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఈ విధంగా అన్నారు. అన్నా.. ఎవరైనా హాలిడే అంటే ఒకసారో రెండు సార్లో వెళ్తుంటారు.. మీరు మాత్రం ఏంటన్న ఏడాది పొడవునా..హాలీడేనేనా.
బహుషా 365 రోజుల్లో 300 రోజులు వెకేషన్ లో ఉండి.. 65 రోజులు షూటింగ్ కు వస్తావా అన్నా.. అని కాస్త టీజ్ చేస్తూ అడిగాడు ఎన్టీఆర్. అంతే కాదు నువ్వు ఉండటం ఫారెన్ లో ఉంటూ.. షూటింగ్ కు మాత్రమే ఇండియాకు వస్తున్నట్టున్నావ్ అన్నా అని తారక్ అన్నారు.
Also Read: డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఆ హీరోయిన్ అంటే పిచ్చి..