ఈరోజు ఎపిసోడ్లో మహేంద్ర నేను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అని అనడంతో వెంటనే రిషి డాడ్ నాకు మీరేం చెప్పకండి మీరు ఎక్కడికి వెళ్లారు ఏంటి ఇవన్నీ అవసరం లేదు మీరు వచ్చారు నాకు అది చాలు ఇంకెప్పుడూ నన్ను వదిలేసి వెళ్ళకండి. మీరు లేకుండా నేను ఎలా ఉండగలను డాడ్ అనడంతో వెంటనే రిషి అంటూ మహేంద్ర గట్టిగా ఎమోషనల్ గా హత్తుకుంటాడు. అప్పుడు రిషి నేను ఏమైనా మీ మనసును బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి అని అనగా వెంటనే మహేంద్ర నా మీద కోపం లేదా రిషి అనడంతో మీ మీద ప్రేమ మాత్రమే ఉంది డాడ్ అని అంటాడు. ఇందులోనే అక్కడికి దేవయాని, ఫణింద్ర వస్తారు. ఇప్పుడు దేవయానికి తండ్రి కొడుకులు మళ్ళీ ఒకటయ్యారన్నమాట అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవయాని దంపతులు ఫణింద్ర ను మాట్లాడిస్తారు.