ఘనంగా అలీ కూతురు వివాహం... సతీసమేతంగా హాజరైన చిరంజీవి, నాగార్జున!

Published : Nov 28, 2022, 08:11 AM IST

నటుడు అలీ కూతురు ఫాతిమా వివాహం ఘనంగా జరిగింది. చిరంజీవి, నాగార్జునతో పాటు చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.   

PREV
15
ఘనంగా అలీ కూతురు వివాహం... సతీసమేతంగా హాజరైన చిరంజీవి, నాగార్జున!
Ali Daughter Marriage

ప్రముఖ కమెడియన్ అలీ-జుబేదాల కూతురు ఫాతిమా వివాహం హైదరాబాద్ లో నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, నాగార్జున సతీసమేతంగా హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

25
Ali Daughter Marriage

కూతురు జుబేదా వివాహాన్ని అలీ అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరుకున్నారు. దీని కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పరిశ్రమ ప్రముఖులను, రాజకీయ నేతలను అలీ స్వయంగా కలిసి కూతురు వివాహానికి ఆహ్వానించారు. 
 

35
Ali Daughter Marriage


దీంతో చిరంజీవి, నాగార్జున సతీసమేతంగా హాజరయ్యారు. చిరంజీవి-సురేఖ, నాగార్జున-అమల.. నూతన దంపతులను ఆశీర్వదించారు. వీరిద్దరి రాక పెళ్లి వేడుకను ప్రత్యేకంగా మార్చేసింది. 
 

45
Ali Daughter Marriage

సీనియర్ హీరోయిన్, మంత్రి రోజా ఈ వేడుకకు హాజరయ్యారు. అలీ ఏపీ సీఎం జగన్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తన కూతురు వివాహానికి రావాలని కోరారు. అయితే బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆయన ఈ వివాహానికి రాలేదని తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా, అలీ సహ నటిగా రోజా ఫాతిమా పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

55
Ali Daughter Marriage

ప్రముఖుల రాకతో అలీ సంతోషం వ్యక్తం చేశారు. అలీకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఫాతిమా వివాహ బాధ్యత అలీ పూర్తి చేశారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమకు వచ్చిన అలీ ఐదు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 
 

click me!

Recommended Stories