ఇప్పుడు ఆనందరావు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు వాళ్ళని చూస్తానా అని ఉంది అనడంతో అప్పుడు సౌందర్య హిమ ఆనందుని తీసుకొని వెంటనే మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెబుతుంది. మరొకవైపు హాస్పిటల్ బెడ్ పై దీప ఉండగా అప్పుడు కార్తీక్,దీప దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే దీప కి స్పృహ వస్తుంది. అప్పుడు కార్తీక్ నీకు హార్ట్ లో చిన్న హోల్ ఉంది దానికి సర్జరీ చేస్తే సరిపోతుంది అనడంతో వెంటనే దీప నాకు ఏమైంది డాక్టర్ బాబు నేను బతుకుతానా లేదా అనడంతో నీకేం కాదు దీప అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప ఎమోషనల్ గా మాట్లాడడంతో అది చూసి కార్తీక్ కూడా బాధపడుతూ ఉంటారు.