Guppedantha Manasu: భార్యను అసహ్యించుకుంటున్న మహేంద్ర.. తెలియకుండానే రిషిని కాపాడిన ఓ అమ్మాయి?

First Published May 30, 2023, 8:43 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుంటుంది. తను నమ్మిన వారే తనని ముంచటంతో మనస్థాపానికి గురైన ఒక కాలేజీ అధినేత కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో ఢిల్లీ నుంచి చాలా ఆనందంగా వస్తాడు మహేంద్ర. హాల్లో ఉన్న తన అన్నకి కంగ్రాట్స్ చెప్పి వెళ్లిన పని చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అక్కడ అందరూ డిబిఎస్డి కాలేజీ గురించి మన రిషి గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు అని చెప్తూ ఉంటాడు. ఇంతలో జగతి వస్తుంది. ఆమెకి కూడా కంగ్రాట్స్ చెప్పి రిషి గొప్పతనం గురించి చెప్తూ ఉంటాడు. మన రిషికల మొత్తానికి నెరవేరింది.
 

వాడు అనుకున్నది సాధించాడు అలాంటి వాడు నా కొడుకు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం వాడు. రోజు రోజుకి వాడికి పేరు ప్రఖ్యాతలు ఎక్కువైపోతున్నాయి. ఇంతకీ వీళ్లిద్దరూ కనిపించడం లేదేంటి. ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేయటానికి బయటికి వెళ్లారా.. ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు మహేంద్ర. మౌనంగా ఉంటుంది జగతి. చెప్పు జగతి, మహేంద్ర అడుగుతున్నాడు కదా రిషి, వసులు ఎక్కడికి వెళ్లారో చెప్పు అంటుంది దేవయాని.
 

అప్పుడు మహేంద్ర కి అనుమానం వస్తుంది. జగతి.. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు. అయినా మీరందరూ ఎందుకు ఇలా డల్ గా ఉన్నారు అని అడుగుతాడు. రిషి మనల్ని వదిలి వెళ్ళిపోయాడు బాబాయ్ తన మనసుకి గాయం చేశారు అంటూ జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర. ఒక్కసారిగా తూలి పడిపోతాడు మహేంద్ర. ఇక భర్తను పట్టుకుపోతుంది జగతి. నన్ను ముట్టుకోవద్దు అంటూ జగతిని అసహ్యించుకుంటాడు మహేంద్ర. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా.
 

నిజానికి నిలువెత్తు రూపం మన రిషి. అలాంటి వాడి మీదా నువ్వు నింద వేసేది. ఒకప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయి నన్ను ఒంటరిని చేసావు ఇప్పుడు వాడిని పంపించేసి మరింత ఒంటరిని చేసావు. అసలు ఇదంతా ఏ ఉద్దేశంతో చేశావు అయినా వసు కూడా ఎందుకిలా చేసింది అంటూ ఆవేశంతో ఊగిపోతాడు. రిషికి మీరు ఇద్దరూ గొప్ప భార్య, గొప్ప తల్లి అవుతారు అనుకున్నాను కానీ వాడి మీద నింద వేసి నిజంగానే గొప్ప తల్లి గా చరిత్రలోకి ఎక్కావు అంటాడు మహేంద్ర.
 

అప్పటికి మేమందరం చెప్తూనే ఉన్నాము రిషి అలాంటివాడు కాదు అని అయినా మా మాట పట్టించుకోలేదు అంటూ మహేంద్ర కోపాన్ని మరింత రెట్టించేలాగా మాట్లాడుతాడు శైలేంద్ర. ఇదంతా రిషి మంచి కోసమే చేశాను అంటుంది జగతి. వాడిని మోసం చేసేటంత మంచి ఏముందని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత బాబాయ్ కి తర్వాతేనా నిజం చెప్పాలని ప్రయత్నిస్తావేమో నిజం తెలిసిన మరుక్షణమే బాబాయిని గాల్లో కలిపేస్తాను అంటూ జగతిని బెదిరిస్తాడు శైలేంద్ర.
 

ఆ తరువాత ఇంత చేసినా కూడా నేను డిబిఎస్టి కాలేజీ ఎండిని అవ్వలేకపోయాను. పిన్ని ఎండి సీట్లో కూర్చుంది. తను చాలా ధైర్యవంతురాలు రిషి కోసమే ఇంత చేసింది. ఇప్పుడు వాడు లేడు కాబట్టి మన మాట వినే ప్రసక్తే లేదు. తన దగ్గర నుంచి సీటు లాక్కునే లోపు మళ్ళీ రిషి వచ్చినా వచ్చేస్తాడు. ఎలాగైనా రిషి ని భూమ్మీద  లేకుండా చేయాలి అనుకుంటాడు శైలేంద్ర. సరిగ్గా అదే సమయంలో రౌడీలు ఫోన్ చేసి రిషి ని ఇప్పుడే చూశాను అని చెప్తారు. ఎవరికి అనుమానం రాకుండా గాల్లో కలిపేయండి.
 

రిషి చనిపోయాడనే విషయం కూడా ఎవరికీ తెలియకూడదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర. సరే అంటూ రిషి ని ఫాలో అవుతారు రౌడీలు. అదే సమయంలో రోడ్డు మీద ఒక అమ్మాయి కారు పాడైపోతుంది. సరిగ్గా పని మీద బయటకు వెళ్తున్నప్పుడే ఇది పాడవుతుంది అని చిరాకు పడుతుంది ఆ అమ్మాయి. అప్పుడే అటుగా వస్తున్న రిషి నేను హెల్ప్ చేయనా అని అడుగుతాడు. ష్యూర్ అంటూ పక్కకి తప్పుకుంటుంది ఆ అమ్మాయి.
 

ఆ కారుని బాగు చేస్తూ ఉంటాడు రిషి. ఇదంతా చూస్తున్న రౌడీలు ఈ అమ్మాయి ఏంట్రా పానకంలో  పుడకలాగా తగులుకుంది అనుకుంటారు. ఇప్పుడు మర్డర్ చేస్తే రెండు చేయాలి పైగా అందరికీ తెలిసిపోతుంది అందుకని నెక్స్ట్ టైం గట్టిగా ప్లాన్ చేయాలి అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు రౌడీలు. కారుని బాగు చేస్తున్న రిషినే తదేకంగా చూస్తూ మీరు రిషి కదా అని యాంగ్జైటీతో అడుగుతుంది ఆ అమ్మాయి. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!