అంత అవసరం రాదేమో అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు మహేంద్ర డల్ గా ఉండడాన్ని చూసి భరించలేక పోతాడు ఫణీంద్ర. ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. కొంచెం తలనొప్పిగా ఉంది అని అన్నకి చెప్పి జగతిని టాబ్లెట్లు అడుగుతాడు. మహేంద్ర జగతితో మాట్లాడటం చూసి తల్లి కొడుకులు షాక్ అయితే ఫణీంద్ర, ధరణి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు.