దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా బాగుంది..బుట్టబొమ్మలా కనిపించింది. కళ్లతోనే అభినయించి మెప్పించింది. కాని అజ్ఞాతవాసి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ కీర్తి సురేష్ అభినయానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కీర్తి సురేష్ నటన, అభినయానికి అవకాశాలువెతుక్కుంటూ వచ్చాయి. ఆతరువాత వచ్చిన మహానటి సినిమాతో ఆమె స్టార్ గామారింది.