బిగ్ బాస్ సీజన్ 7లో బుల్లితెర నటుడు అమర్ దీప్ కి ఎంత క్రేజ్ వచ్చిందో అంతే స్థాయిలో నెగిటివిటి కూడా మూటగట్టుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7లో ఫస్ట్ హాఫ్ లో అమర్ దీప్ ఇండిపెండెంట్ గా వ్యవహరించలేదని.. యాక్టివ్ గా లేడని విమర్శలు ఉన్నాయి. అసలు అమర్ దీప్ కనీసం టాప్ 5 కి చేరుకుంటాడా అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ సెకండ్ హాఫ్ లో అగ్రెసివ్ అయ్యాడు.
అయితే కాస్త హద్దులు మీరి గోల చేసినప్పటికీ అది అతడికి ప్లస్ అయ్యింది. ఫలితంగా శివాజీని వెనక్కి నెట్టి రన్నరప్ గా నిలిచాడు. హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసిందే. అమర్ దీప్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నెగిటివిటీ పెరుగుతుండడంతో అతడి భార్య తేజస్విని గౌడ నరకం చూసిందట.
తాజాగా ఇంటర్వ్యూలో తేజస్విని తమ లవ్ స్టోరీ బయట పెడుతూ.. బిగ్ బాస్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమర్ దీప్, తేజస్విని 2022లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తేజస్విని తమ ప్రేమ కథ చెబుతూ.. ముందుగా ప్రపోజ్ చేసింది అమర్ అని తెలిపింది. కోయిలమ్మ టివి సీరియల్ సమయంలో ప్రపోజ్ చేశాడు. అంతకు ముందు పరిచయం ఉండేది కానీ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే.
తొలిసారి ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేశా. అలాంటిది ఏమి లేదు ఫ్రెండ్స్ గానే ఉందాం అని చెప్పా. కానీ వదల్లేదు. కొంతకాలం సైలెంట్ గా ఉన్నాడు. నేను అంతా ఈజీగా ఒప్పుకోలేదు. కాస్త టార్చట్ పెట్టాను. మళ్ళీ మూడేళ్ళ తర్వాత ప్రపోజ్ చేశాడు. అప్పుడు కూడా ఏం చెప్పానంటే.. వచ్చి మా ఇంట్లో మాట్లాడు.. వాళ్ళు ఒప్పుకుంటే ఒకే.. లేకుంటే ఇంతటితో మరచిపో అని చెప్పినట్లు తేజస్విని తెలిపింది. దీనితో అమర్ నరకం అనుభవించాడట.
మొత్తానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వారి పెళ్లి జరిగింది. కానీ ఇప్పుడు భర్తపై తేజస్విని అమితమైన ప్రేమని వ్యక్తం చేస్తోంది. అమర్ బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు తాను నరకం అనుభవించినట్లు ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. అమర్ పై నెగిటివిటి పెరిగిపోతుంటే చాలా భాదగా అనిపించిందట. అమర్ ఏం చేసినా నెగిటివ్ గా హైలైట్ చేసేవారు.
దీనితో లైవ్ చూడాలంటే భయం వేసేది. బిగ్ బాస్ ని ఒక కర్మలాగా ఫీల్ అయిందట. ఎప్పుడెప్పుడు ఇది వదిలిపోతుందా అని వెయిట్ చేసిందట. ఇకపై బిగ్ బాస్ గురించి మాట్లాడకూడదు అని అనుకుంటున్నట్లు తేజస్విని హాట్ కామెంట్స్ చేసింది.