Madhuri Rathod: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే

Published : Oct 31, 2026, 01:29 PM IST

Madhuri Rathod Top 5 Telugu Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ సాధిస్తూ దూసుకుపోతున్న సింగర్ అండ్ యాక్టర్ మాధురి రాథోడ్ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం. ఈ సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

PREV
16
కోట్లాది వ్యూస్‌.. మాధురి రాథోడ్ ఫోక్ సాంగ్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

సోషల్ మీడియా యుగంలో జానపద పాటలకు యువత నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అచ్చమైన పల్లెటూరి మాడ్యులేషన్, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే పాటలు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్, నటి మాధురి రాథోడ్ నటించిన జానపద పాటలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. కోట్ల సంఖ్యలో వ్యూస్‌ను సొంతం చేసుకుంటూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాధురి రాథోడ్ నటించి అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

26
నిమ్మతోట వనములో డీజే ఫుల్ సాంగ్

మాధురి రాథోడ్ నటించిన పాటల్లో 'నిమ్మతోట వనములో' డీజే ఇన్‌స్టా ట్రెండింగ్ ఫోక్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ఆల్‌టైమ్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఎన్ మ్యూజిక్ ఛానెల్‌లో విడుదలైన ఈ పాట ఏకంగా 17.6 కోట్లకు పైగా వ్యూస్, 5.2 లక్షలకు పైగా లైక్‌లు సాధించి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటను ప్రభ ఆలపించగా, వెంకట్ అజ్మీర సంగీతం అందించారు. నాని నిర్మల్ డిజె మిక్స్ చేయగా, లావణ్య రవిందర్ సాహిత్యం అందించారు. జనతా బాబ్లు ఎడిటింగ్ నిర్వహించగా, లీడింగ్ బాయ్స్ కొరియోగ్రఫీ అందించారు.

36
సన్న సన్న బియ్యమే ఫుల్ జోష్ సాంగ్

మర్రికింద యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైన 'సన్న సన్న బియ్యమే' ఫుల్ సాంగ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సంచలనం సృష్టించింది. ఈ పాట ఇప్పటివరకు 4.5 కోట్లకు పైగా వ్యూస్, 1.4 లక్షలకు పైగా లైక్‌లు సాధించింది. అనిల్ గౌడ్ రంగు నిర్మాతగా వ్యవహరించగా, గంగమణి ట్యూన్ అందించారు. పంబాల రమేష్ సాహిత్యాన్ని సమకూర్చగా, శిరీష, గంగమణి పాటను ఆలపించారు. వెంకట్ అజ్మీర సంగీతం అందించిన ఈ పాటలో మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయ్ జంటగా నటించారు. లీడింగ్ బాయ్స్ శ్రీకాంత్ కొరియోగ్రఫీ చేయగా, సురేష్ సూర్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

46
ప్రమిల ఫుల్ సాంగ్ అదిరింది అంతే !

త్రిశూల్ వీణ ఛానెల్‌లో విడుదలైన 'ప్రమిల' ఫుల్ సాంగ్ నెట్టింట ఊపేస్తోంది. ఈ పాట ఇప్పటివరకు 8.8 కోట్లకు పైగా వ్యూస్ సాధించడంతో పాటు 2.65 లక్షలకు పైగా లైక్‌లు పొందింది. సురేందర్ మను సాహిత్యం అందించగా, కృష్ణుడు సంగీతం సమకూర్చారు. ఉష అక్క, నర్సిములు ఈ పాటను పాడగా.. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయ్, రాజ్ నరేంద్ర నటించారు. శ్రీకాంత్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

56
మంజులో మాట్లాడిపోతా ఫుల్ సాంగ్

తకిట షో ఛానెల్‌లో విడుదలైన 'మంజులో మాట్లాడిపోతా' పాట యూట్యూబ్‌లో విశేష స్పందన సాధించింది. ఈ పాట ఇప్పటివరకు 1.9 కోట్లకు పైగా వ్యూస్, 80 వేలకు పైగా లైక్‌లు దక్కించుకుంది. శ్రీను ఎ.వి. నిర్మాణంలో వెంకట్ అజ్మీర సంగీతం అందించగా, చింతల్‌పేట్ రవి సాహిత్యం అందించారు. నరసింహులు, శ్రీనిధి ఆలపించిన ఈ పాటలో వెంకట్ అజ్మీర, మాధురి రాథోడ్ జంటగా అలరించారు.

66
బామా సుందరాలో ఫుల్ సాంగ్

తకిట షో ఛానెల్‌లోనే విడుదలైన 'బామా సుందరాలో' ఫుల్ సాంగ్ కూడా రికార్డు వ్యూస్ వైపు దూసుకుపోతోంది. ఈ పాట విడుదలైన స్వల్ప వ్యవధిలోనే 1.2 కోట్లకు పైగా వ్యూస్ సాధించి 1.63 లక్షల లైక్‌లను సొంతం చేసుకుంది. వెంకట్ అజ్మీర మ్యూజిక్‌కు దివంగత రామస్వామి, రమేష్ పంబాల సాహిత్యం అందించగా, నర్సిములు, ముకుంద అలపించారు. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ, దర్శకత్వంలో మాధురి రాథోడ్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories