ఈ క్రమంలో రష్మిక మందన ముందుగా బలైంది. రష్మిక పేస్ ని ఇంకొకరికి టెక్నాలజీ ద్వారా ఫేక్ చేసి వీడియో ఇంటర్నెట్ లో వదిలారు. దీనితో దేశవ్యాప్తంగా రష్మికకి మద్దతు లభిస్తోంది. టెక్నాలజీని ఇలాంటి చెత్త పనులకు కాకుండా ఉపయోగపడేందుకు వినియోగించాలని అంతా విమర్శిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా.. ఇతర మహిళలు, సెలెబ్రిటీలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమితాబ్, నాగ చైతన్య, కీర్తి సురేష్, కేటీఆర్ ఇలా సినీ రాజకీయ ప్రముఖులంతా ఖండిస్తున్నారు.