Devatha: చిన్మయి గురించి ఆలోచిస్తున్న రాధా.. దేవికి దగ్గరవుతున్న మాధవ!

Published : Jun 15, 2022, 12:14 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 15 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Devatha: చిన్మయి గురించి ఆలోచిస్తున్న రాధా.. దేవికి దగ్గరవుతున్న మాధవ!

 ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ(devudamma ), రుక్మిణి గురించి ఆలోచిస్తూ.. రుక్మిణి చనిపోయింది అని అందరూ అనుకున్నాము. కానీ రుక్మిణి శవాన్ని ఎవరూ చూడలేదు. కాబట్టి పూజారి మాటలను బట్టి చూస్తుంటే రుక్మిణి ఎక్కడో బతికే ఉంది అని అనిపిస్తుంది. కాబట్టి రుక్మిణి (rukmini)తిరిగి ఇంటికి వచ్చే వరకు నేను ఉపవాసం చేస్తాను పూజారి చెప్పినట్టుగా దీక్షలో కూర్చుంటాను అని అంటుంది దేవుడమ్మ.
 

26

ఇంతలో ఆమె భర్త ఈశ్వర్ ప్రసాద్(eswar prasad)నీ ప్రాణాలు అలా అడ్డుపెట్టుకొవడం కరెక్ట్ కాదు అని అనడంతో అప్పుడు దేవుడమ్మ దేవుని వంతు దేవుడు చేస్తాడు మన వంతు కూడా మనం ప్రయత్నించాలి అని అంటుంది. ఆ మాటలు విన్న సత్య(sathy) అక్కడికి వచ్చి అటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి మీ ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పినా కూడా దేవుడమ్మా ఆ మాటలు పట్టించుకోకుండా రుక్మిణి దొరికేవరకు ఉపవాసం చేస్తూనే ఉంటాను అని అంటుంది.
 

36

 మరొక వైపు రాధ (radha)తాను మాధవ ఇంట్లో ఉంటున్నాను కానీ ఆదిత్య ఎప్పుడూ అసలు ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నావు అని నన్ను ఒక్క మాట కూడా అడగలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. త్వరలోనే దేవిని ఆదిత్య(adithya)కు అప్పజెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో చిన్మయి అక్కడికి వచ్చి అమ్మ నీ చీర బాగుంది అంటూ నుదుటిపై ముద్దు పెడుతుంది.
 

46

 ఆ తర్వాత దేవి (devi)పిలవడంతో చిన్మయి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు రాధ చిన్మయి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు దేవుడమ్మ అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆదిత్య సత్య (sathya)పై ఫైర్ అవుతూ ఉంటాడు. అమ్మ అటువంటి నిర్ణయం తీసుకుంటుంటే నువ్వు ఆపకుండ ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు.
 

56

 మరొకవైపు దేవి(deviki)కి కాళ్లు బాగా లేకపోవడంతో చిన్మయి నొక్కుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రాధ వచ్చి దేవికి బాగాలేదు అని చెప్పడంతో వేడి నీళ్ల కోసం వెళుతుంది. వెంటనే దేవి కూడా రాధ తో పాటు వెళ్లి పాపం కదా అమ్మ అక్కకు అమ్మ లేదు కదా అని అనగా అప్పుడు రాధ (radha)నేను అమ్మను ఉన్నాను కదా అని అంటుంది.
 

66

 తాను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే చిన్మయి(chinmayi) అడ్డుగా ఉంది అని బాధపడుతుంది రాద(radha). రేపటి ఎపిసోడ్ లో మాధవ కావాలనే కిందపడి దేవి కీ రాధ గురించి లేనిపోని మాటలు నూరిపోస్తాడు. ఆ తర్వాత భాష ఆదిత్య వెళ్లి ఇంటికి వెళ్తూ ఉంటాడు.

click me!

Recommended Stories