Devatha: ఆదిత్యకు గోరుముద్దలు పెట్టిన దేవి.. రాధ కోసం మాధవ మరో ఎత్తుగడా!

Published : Jun 29, 2022, 10:52 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 29 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Devatha: ఆదిత్యకు గోరుముద్దలు పెట్టిన దేవి.. రాధ కోసం మాధవ మరో ఎత్తుగడా!

 ఈరోజు ఎపిసోడ్ లో సత్య(sathya), ఆదిత్య దగ్గరకు వచ్చి నువ్వు వాచ్మెన్ కి ఫోన్ ఇచ్చాను అని నాకు అబద్ధం ఎందుకు చెప్పావు అని అడగగా ఆదిత్య షాక్ అవుతాడు. అప్పుడు ఆదిత్య ఈ వాచ్మెన్ కి కాదు మా ఆఫీస్ దగ్గర ఉన్న వాచ్మెన్ కి ఇచ్చాను అని అబద్ధం చెప్పి మళ్ళీ తప్పించుకుంటాడు. అయినా నేను ఫోన్ ఇచ్చానా లేదా అని ఎంక్వయిరీ చేస్తున్నావా అని ఆదిత్య(adithya)అడగగా లేదు అతను ఫోన్ మాట్లాడేటప్పుడు చూశాను అని అంటుంది సత్య.
 

26

 అప్పుడు సత్య త్వరలోనే అమెరికాకు వెళ్తున్నాము ఏర్పాట్లు చేసుకో అని అంటుంది. మరొకవైపు దేవి(devi)ఆఫీసర్ దగ్గరికి వెళ్లి నేర్చుకోవాలి అని రెడీ అవుతూ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు జానకి(janaki)దంపతులు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా ఆఫీసర్ సార్ దగ్గరికి వెళ్తున్నాను. స్కూల్ లో జరిగే ఫంక్షన్ లో స్పీచ్ ఇవ్వడం కోసం నేర్చుకోవడానికి వెళ్తున్నాను అని అంటుంది.
 

36

ఇంతలోనే రాధ(radha)అక్కడికి వచ్చి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళావా ఆలస్యం అవుతుంది అన్నట్టుగా మాట్లాడటంతో మాధవ, రాధ మాటలు వింటూ ఉంటాడు అప్పుడు దేవి ఆఫీసర్ సారు అంటే చాలా ఉత్సాహం చూపిస్తోంది అనడంతో వెంటనే రాధా కొన్ని బంధాలు దూరంగా ఉన్నప్పుడు దేవుడు కలుపుతూ ఉంటాడు అని అనగా మాధవ(madhava)కోపంతో రగిలిపోతాడు.
 

46

మరొకవైపు ఆదిత్య కూడా దేవి(devi) వస్తుంది అని రెడీ అవుతూ ఉంటాడు. మరొకవైపు ఆదిత్య రోజంతా తన కూతురు దేవీతో సంతోషంగా గడపాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సత్య(sathya)వచ్చి ఏంటి అన్న తొందరగా వెళ్తున్నావు అని అడగగా దేవి వస్తుంది అని చెబుతాడు. అప్పుడు సత్య మాధవ ను ఉద్దేశిస్తూ దేవి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెబుతుంది.  మొత్తానికి దేవి ఆదిత్య ఇద్దరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలుస్తారు.
 

56

అప్పుడు దేవికి(devi) తినడానికి కోసం ఆదిత్య స్నాక్స్ తెప్పిస్తాడు. ఆ తర్వాత దేవితో కాసేపు మాట్లాడి తన పని తాను చేసుకుంటూ ఉండగా దేవి మాత్రం ఆదిత్య ఎలా మాట్లాడుతున్నాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అన్నది అబ్సర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత దేవి తానే స్వయంగా ఆదిత్య(adithya)కు భోజనం తినిపిస్తుంది. మరొకవైపు సత్య దగ్గరికి కమలా భాష వెళ్లి మాట్లాడుతూ ఉంటారు.
 

66

 అప్పుడు కమల(kamala) ఆదిత్యలో మార్పు వచ్చింది. మునిపటిలా భాషను తనతో పాటు తీసుకెళ్లడం లేదు అని అనడంతో అప్పుడు సత్య రుక్మిణి అక్క బతికే ఉంది అన్న విషయం బాష(basha) కు ఎక్కడ తెలిసి పోతుందో అని తీసుకెళ్లడం లేదు అని తన మనసులో అనుకుంటుంది. మరొకవైపు స్కూల్ దగ్గర భాగ్యమ్మ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

click me!

Recommended Stories