ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. మాధవకు సత్య ఫోన్ చేస్తుంది.. దేవి ఏంటి ఏవేవో చెబుతుంది.. మీరు దేవి తండ్రి కాదు అని తండ్రి కోసం వెతుకుతుంది అని చేబుతుంది అంటే దేవి ఎందుకు అలా చెబుతుంది? రాధ, ఆదిత్యనే ఆలా చెబుతున్నారు.. వాళ్లకు నేను అడ్డు ఉండకూడదు అని ఆలా చెబుతున్నారేమో అంటూ నమ్మిస్తాడు.. ప్లీజ్ సత్య నా కాపురాన్ని నిలబెట్టు.. ఈరోజు ఆ మాట చెప్పింది అంటే రేపు మాధవ్ నా భర్త కాదు అని రాధ కూడా చెబుతుంది ఏమో.. ప్లీజ్ సత్య నా జీవితాన్ని కాపాడు అంటూ మాధవ్ దొంగ ఏడుపు ఏడుస్తాడు.