Manchu Lakshmi: హాలీవుడ్డో బాలీవుడ్డో  అనుకునేరు, పక్కా తెలుగు మెటీరియల్... మంచు లక్ష్మి అసలు తగ్గడం లేదుగా!

Published : Feb 16, 2023, 06:26 PM ISTUpdated : Feb 16, 2023, 07:37 PM IST

మంచు లక్ష్మి మరో గ్లామరస్ ఫోటో షూట్ తో వచ్చేశారు. ఎవరేమనుకున్నా అసలు తగ్గేదేలే అంటున్నారు. హాట్ ట్రెండీ వేర్ ధరించి స్టైలిష్ లుక్ లో కేక పుట్టించారు.

PREV
15
Manchu Lakshmi: హాలీవుడ్డో బాలీవుడ్డో  అనుకునేరు, పక్కా తెలుగు మెటీరియల్... మంచు లక్ష్మి అసలు తగ్గడం లేదుగా!
Manchu Lakshami

సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటుంది మంచు లక్ష్మి. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా నేను చేసేది చేస్తానంటుంది. ఆమె ఏం చేసినా ట్రోల్ చేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. మంచు ఫ్యామిలీ మీద బ్రతికేసే యూట్యూబ్ ఛానల్స్, మీమ్ పేజెస్ ఎన్నో ఉన్నాయి. వారందరి టార్గెట్ మోహన్ బాబు, విష్ణు అలాగే మంచు లక్ష్మి.

25
Manchu Lakshami


విమర్శలను నేను పట్టించుకోను అంటుంది మంచు లక్ష్మి. ఎవరో పనిలేనోళ్ళు ఏదో అన్నారని మన ప్రయత్నం ఆపకూడదు. అలా ఇతరుల కామెంట్స్ పట్టించుకుంటే జీవితంలో ఏం చేయలేమంటుంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి చాలా సందర్భాల్లో చెప్పారు. 
 

35
Manchu Lakshami


అలాగే జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తూనే ఉంటారు. గత ఏడాది మంచు విష్ణు హీరోగా జిన్నా విడుదలైంది. డిజాస్టర్ అయ్యింది. 2021లో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా థియేటర్స్ లోకి వచ్చింది అది డబుల్ డిజాస్టర్. చివరికి మంచు లక్ష్మికి కూడా కాలం కలిసి రావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా కనీస ఫేమ్ సంపాదించలేకపోతున్నారు . 

45
Manchu Lakshami


తాజాగా ఆమె అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది. అగ్నినక్షత్రంతో పాటు కొన్ని చిత్రాలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి లుక్ ఆకట్టుకుంది. 
 

55
Manchu Lakshami

ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మి గ్లామర్ షో కొనసాగుతుంది. తాజాగా ప్రింటెడ్ హాట్ ట్రెండీ వేర్ ధరించి కిరాక్ ఫోజులిచ్చారు. మంచు లక్ష్మి డ్రెస్ పై నెటిజన్స్ సెటైర్స్ స్టార్ట్ చేశారు. నీ వయసుకు తగ్గ బట్టలు ధరించని ఒకరు కామెంట్ చేయగా... ముసలమ్మలా ఉన్నావంటూ మరొకరు ట్రోల్ చేశారు. మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

click me!

Recommended Stories