సినీ ఇండస్ట్రీలో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న కాజల్ అగర్వాల్.. ఫ్యాన్స్ కు గుర్తుండిపోయే చిత్రాలివే!

First Published | Feb 16, 2023, 5:47 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫిల్మ్ ఇండస్ట్రీలో 2023తో 16 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు చందమామకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) గురించి సౌత్, నార్త్ ఆడియెన్స్ కు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. మరోవైపు తన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ నూ పెంచుకున్నారు. 
 

పెళ్లి, ప్రెగ్నెన్సీ, తల్లిగా ప్రమోషన్ పొందడంతో కాజల్ అగర్వాల్ సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. గ్రాండ్ రీఎంట్రీకి సిద్ధం అవుతున్నారు. ఇ్పటికే తను నటించిన రెండు తమిళ చిత్రాలతో పాటు ఓ హిందీ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తమిళంలో ‘ఇండియన్ 2’ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. 
 


అయితే, ఈఏడాది కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగుపపెట్టి 16 ఏళ్లు విజయవంతంగా పూర్తి అయ్యింది. దీంతో కాజల్ కు ఫ్యాన్స్, సినీ ప్రియులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాజల్ నటన, హిట్ సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇన్నేళ్లుగా సినిమా పట్ల కాజల్ చూపించిన డెడికేషన్, శ్రమను అభినందిస్తున్నారు. 
 

కాజల్ అగర్వాల్ తెలుగులోకి 2007లో విడుదలైన ‘లక్ష్మి కళ్యాణం’తో ఎంట్రీ ఇచ్చారు.  ఆ తర్వాత వచ్చిన ‘చందమామ’ చిత్రంతో నటిగా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్నారు. అప్పటి నుంచి తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూనే వచ్చారు. ఇప్పటి వరకు 50కిపైగా చిత్రాల్లో నటించారు. 
 

అయితే కాజల్ కేరీర్ లో కొన్ని గుర్తుండిపోయే చిత్రాలు చేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’తో కాజల్ కు మంచి క్రేజ్ దక్కింది. నటిగా అందరి ప్రశంసలు పొందారు. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ కావడంతో కాజల్ కు కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందాయి. దాంతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. అలాగే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన నటించిన ‘డార్లింగ్’ చిత్రం కూడా ఇప్పటికీ గుర్తుండిపోయేదే. ఈ చిత్రంలో కాజల్ నటకు ప్రేక్షకుల నుంచి నూటికి నూరుమార్కులు పడ్డాయి. 
 

అప్పటికే క్రేజ్ ఉన్న ఈబ్యూటీ ‘డార్లింగ్’ చిత్రంతో మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అలాగే డార్లింగ్ సరసన నటించి ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’లోనూ కాజల్ పెర్ఫామెన్స్ కు ప్రశంసల వర్షం కురిసింది. ఇటు అటు బాలీవుడ్ లోనూ 2011లో వచ్చిన అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘సింగం’తోనూ నార్త్ లో క్రేజ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఇప్పటి నుంచి ఎలా సాగుతుందో చూడాలి. 

Latest Videos

click me!