Jiohotstar: దుమ్ములేపుతున్న సమంత, భూమిక, శ్రద్దా దాస్.. జియో హాట్ స్టార్ లో టాప్ 5 ట్రెండింగ్ మూవీస్

Published : Jul 23, 2026, 03:44 PM IST

Jiohotstar Movies: సమంత, శ్రద్దా దాస్, భూమిక లాంటి క్రేజీ నటీమణులు నటించిన చిత్రాలు జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
16
జియో హాట్ స్టార్

ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో తరచుగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే సినిమాలు అందుబాటులోకి వస్తూ ఉంటాయి. వివిధ భాషలకు చెందిన కొత్త కంటెంట్ రిలీజ్ చేస్తుంటారు. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో కొన్ని సినిమాలు ట్రాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. వాటిలో సమంత, శ్రద్దా దాస్, భూమిక నటించిన చిత్రాలు ఉన్నాయి. టాప్ 5 ట్రెండింగ్ మూవీస్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

26
మా ఇంటి బంగారం

సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో సమంత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో కూడా దుమ్ములేపుతోంది. జియోహాట్ స్టార్ లో మా ఇంటి బంగారం మూవీ నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.

36
త్రికాల

శ్రద్ధాదాస్, మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన త్రికాల చిత్రం థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది.

46
యుఫోరియా

గుణశేఖర్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ డ్రామా ప్రస్తుతం హాట్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. 3వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. ఈ చిత్రంలో భూమిక, ధురంధర్ ఫేమ్ సారా అర్జున్, విగ్నేష్ గవిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు.

56
స్పైడర్ మాన్ హోమ్ కమింగ్

ఎప్పుడో 2017లో థియేటర్స్ లో సందడి చేసిన స్పైడర్ మాన్ హోమ్ కమింగ్ మూవీ ఇప్పుడు హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతోంది. నాల్గవ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.

66
మాలీవుడ్ టైమ్స్

మలయాళంలో తెరకెక్కిన డార్క్ కామెడీ చిత్రం ఇది. ఓ యువకుడు మలయాళం సినీ ఇండస్ట్రీలో హారర్ చిత్రాల ఫిలిం మేకర్ కావాలని కలలు కంటుంటాడు. కానీ అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేదే ఈ చిత్ర కథ. జియో హాట్ స్టార్ లో 5వ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories