నరేష్ చేసింది ఏమీ లేదు, ఎన్నికలు జరగకుండా ప్లాన్స్ వేస్తున్నారు... నటి హేమ సెన్సేషనల్ కామెంట్స్

First Published Aug 7, 2021, 8:27 AM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ బరిలో ఉన్న నటి హేమ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అసలు ఎన్నికలు జరగకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఎలక్షన్స్ త్వరగా జరిపేలా మా సభ్యులు కొందరికి వాయిస్ మెసేజ్ పంపారు. 
 

నరేష్ అధ్యక్షతన గల ప్రస్తుత మా పాలక వర్గం గడువు ముగిసి చాలా కాలం అవుతుంది. అయితే కరోనా పరిస్థితుల రీత్యా ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. సెప్టెంబర్ లో పరిస్థితులను బట్టి ఎన్నికల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించినట్లు నరేష్ గతంలో తెలియజేశారు. 
 


ఎన్నికలు జరిగి కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత కమిటీకి సర్వ అధికారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరపకుండా తానే మరికొంత కాలం అధ్యక్షుడిగా ఉండేందుకు నరేష్ ప్రణాళికలు వేస్తున్నారని హేమ ఆరోపిస్తున్నారు. 


అలాగే మా కోసం ఆయన సంపాదించినది కొత్తగా ఏమీ లేదని, ఉన్న డబ్బులను దర్జాగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఆఫీస్ ఖర్చులకు కూడా బయట నుండి ఫండింగ్ చేయకుండా అకౌంట్ లో ఉన్న మొత్తం ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కష్టపడి సంపాదించిన డబ్బులను నరేష్ ఖర్చు పెడుతున్న తీరు బాధాకరం అన్నారు. 
 


మా అకౌంట్ లో ఉన్న రూ. 5కోట్లలో రూ. 3కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇలా ఖర్చు చేస్తూ పోతే భవిష్యత్ లో పెన్షన్స్ ఇవ్వడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు. మా అకౌంట్ జీరో అయిపోతుంది. అందుకే వెంటనే ఎలక్షన్స్ జరిపేలా క్రమశిక్షణా కమిటీకి సిఫార్స్ చేయాలి. దాని కోసం మీ సప్పోర్ట్ కావాలి. 

Naresh


నేను 200 నుండి 250 మందికి ఈ వాయిస్ మెసేజ్ పంపాను. నేను ఓ మనిషిని పంపుతాను.. ఆ లెటర్ లో సైన్ చేయండి. నా వాయిస్ మెసేజ్ లో ఏముందో.. లెటర్ లో కూడా అదే ఉంటుంది. అని తన వాయిస్ మెసేజ్ లో నటి హేమ పొందుపరిచారు. 

నరేష్ మా కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా... ఎన్నికలు డిలే చేసి అధ్యక్ష పదవిలో ఎక్కువ కాలం కొనసాగాలని చూస్తున్నారని ఆరోపించడం జరిగింది. అలాగే గత ఎన్నికల్లో తనకు 300లకు పైగా ఓట్లు రాగా, వాళ్ళ సప్పోర్ట్ తోనే ఎన్నికల బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. 

మరోవైపు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటుడు నరసింహారావు ఎన్నికల బరిలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కామెంట్స్ ఒక విధంగా సంచలనం రేపాయి. 
 

click me!