ఒక్క పోస్ట్ ఐదు లక్షలు?.. వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ టచ్ చేస్తే షాక్‌ కొట్టేలా ఉందిగా!

Published : Aug 06, 2021, 07:34 PM IST

వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ఆ ఇమేజ్‌ని కరెక్ట్ గా ఉపయోగించుకుని అవకాశాలను దక్కించుకుంటుంది. ఇటీవల `ఇష్క్`తో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చిందీ భామ. 

PREV
110
ఒక్క పోస్ట్ ఐదు లక్షలు?.. వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ టచ్ చేస్తే షాక్‌ కొట్టేలా ఉందిగా!

ఒక్క కన్నుగీటుతో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ప్రియా కన్నుకొట్టిన విధానానికి కుర్రాళ్లంతా ఫిదా అయిపోయారు. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయిపోయిందీ భామ. 

210

మలయాళ సినిమాలోని పాటతో వచ్చిన క్రేజ్‌తో అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. అల్లు అర్జున్ సైతం ఆమెని అభినందించారు. ఆమె నటించిన సినిమా ఈవెంట్‌కి గెస్ట్ గా వెళ్లాడు బన్నీ.

310

ఈ ఏడాది రెండు సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. నితిన్‌తో `చెక్‌` చిత్రంలో నటించింది. ఆయనకు లవ్‌ ఇంట్రెస్ట్ గా మెరిసింది. కానీ ఈ సినిమా పరాజయం చెందలేదు. 

410

మరోవైపు ఇటీవల తేజ సజ్జాతో కలిసి `ఇష్క్` సినిమాలో మెరిసింది. ఓ రకంగా ఆమెకిది పూర్తి స్థాయి డెబ్యూ చిత్రమని చెప్పొచ్చు. కానీ ఈ చిత్రం కూడా డిజప్పాయింట్‌ చేసింది. 

510

మరోవైపు మలయాళం, హిందీ సినిమాలతో ప్రస్తుతం బిజీగానే ఉంది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. బాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేస్తున్నట్టు ఇటీవల పేర్కొంది. 

610

ఇదిలా ఉంటే ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి గురించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అదే ఆమె ఒక్కో పోస్ట్ కి తీసుకునే రెమ్యూనరేషన్‌. బేసిక్‌గా ఓ స్థాయి ఇమేజ్‌, పాపులారిటీ వచ్చాక తారలు ఏం చేసినా హైలైట్‌గానే నిలుస్తుంది. 

710

వారు సోషల్‌ మీడియాలో చేసే ప్రతి పోస్ట్ లక్షల మందికి రీచ్‌ అవుతుంది. అంత మంది నెటిజన్లు వారిని ఫాలో అవుతుంటారు. అలా ఏడు మిలియన్ల ఫాలోవర్స్ కలిగిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి సోషల్‌ మీడియాలో విపరీతమైన డిమాండ్‌ ఉంది. 
 

810

తన ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రియా ప్రకాష్‌ ప్రమోషన్‌కి సంబంధించిన ఏదైనా ప్రొడక్ట్ కోసం ఒక్క పోస్ట్ పెట్టాలంటే ఏకంగా ఐదు లక్షలు తీసుకుంటుందట. దాదాపు స్టార్‌ హీరోయిన్ల స్థాయిలో ఈ అమ్మడు పారితోషికం తీసుకుంటుండటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

910

ప్రియా ప్రకాష్ వారియర్‌ సైతం తనకున్న క్రేజ్‌ని ఈ రకంగా వాడుకుంటుందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. వెలుగున్నప్పుడు ఇల్లు చక్కపెట్టుకోవడమంటే ఇదేనేమో అంటూ సెటైర్లు వేస్తున్నరు సోషల్‌ మీడియా అభిమానులు.

1010

సినిమాలకు పారితోషికం విషయంలో మాత్రం ఫ్లెక్సీబుల్‌గానే ఉంటుందట. హీరోయిన్‌గా నిలబడే విషయంలో వచ్చే ఆఫర్లని బట్టి, సినిమా స్థాయిని బట్టి తాను రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందని టాలీవుడ్‌ టాక్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories