బర్త్‌ డే వేడుకలో మాళవిక మోహనన్‌ హంగామా.. మోకాళ్లపైకున్న రెడ్‌ డ్రెస్‌లో కవ్వింత..

First Published Aug 6, 2021, 9:39 PM IST

విజయ్‌ `మాస్టర్‌` భామ మాళవిక మోహనన్‌ ఇటీవల తన 28వ పుట్టిన రోజు జరుపుకుంది. రెడ్‌ డ్రెస్‌లో ఈ అమ్మడు థైస్‌ షో చేస్తూ చేసిన హంగామా మామూలుగా లేదు. తాజాగా ఈ బర్త్ డే పిక్స్ పంచుకుంది మాళవిక. అవి వైరల్‌ అవుతున్నాయి. 
 

మాళవిక మోహనన్‌ బుధవారం బర్త్ డే జరుపుకుంది. ఈ సందర్బంగా దిగిన ఫోటోలను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. తనకిష్టమైన వారితో బర్త్ డే చేసుకోవడం పట్ల మాళవిక సంతోషం వ్యక్తం చేసింది.

ఈ అమ్మడు పంచుకున్ని ఈ పిక్స్ వైరల్‌ అవుతుంది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈసందర్భంగా తనకు విషెస్‌ చెప్పిన అందరికి ధన్యవాదాలు తెలిపింది మాళవిక. 

కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్‌ బ్యూటీగా నిలుస్తున్న మాళవిక మోహనన్‌ ఇటీవల మరింతగా రెచ్చిపోయింది. తన అందాలను అప్పనంగా ఆరబోసి కుర్రాళ్ల గుండెల్ని చిత్తు చేస్తుంది. మతులు గతులు తప్పేలా చేస్తుంది.

బర్త్ డే సందర్భంగా విజయ్‌ భామ ఇచ్చిన హాట్‌ పోజులు మతిపోగొడుతున్నాయి. ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.యు మోహనన్‌ కుమార్తె మాళవిక మోహనన్‌. చిత్ర పరిశ్రమకి చెందిన ఫ్యామిలీ కావడంతో మాళవిక ఎంట్రీ ఈజీగానే జరిగింది. 

కేరళాలో 1992లో జన్మించిన ఈ అందాల సోయగం ఎక్కువగా ముంబయిలో పెరిగింది. తండ్రి కె.యు మోహనన్‌ మాలీవుడ్‌ సినిమాలతోపాటు బాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసేవారు. దీంతో ఈ అమ్మడు ముంబయిలో పెరిగింది. 
 

గ్రాడ్యూయేట్‌ చేసిన మాళవిక చదువుకునే టైమ్‌లోనే మోడల్‌గా చేసింది. పలు కమర్షియల్‌ యాడ్స్ లో నటించింది.  ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ యాడ్‌లో మమ్ముట్టితోనూ యాక్ట్ చేసింది. ఇలా జనాలకు పరిచయం అయ్యిందీ హాట్‌ భామ. 
 

2013లో `పట్టమ్‌ పోలే` చిత్రం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యింది. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ సరసన నటించి ఆకట్టుకుంది. అనంతరం రెండేళ్ల తర్వాత `నిర్ణయకమ్‌` లో మెరిసింది. 

2016లో కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `నాను మట్టు వరలక్ష్మి` చిత్రంలో యంగ్‌ హీరో పృథ్వీ సరసన అలరించింది. మరో ఏడాది 2017లో `బియాండ్స్ ది క్లౌడ్స్` చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. 

అదే ఏడాది మలయాళంలో చేసిన `ది గ్రేట్‌ ఫాదర్‌` సినిమా మాళవికకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో ఆమె నటన మెస్మరైజ్‌ చేస్తుంది. 
 

2019లో `పెట్టా` చిత్రంలో రజనీకాంత్‌ సరసన మెరిసింది. తమిళంలోకి డెబ్యూ ఇస్తూనే రజనీతో నటించడంతో మాళవిక కెరీర్‌ బిగ్‌ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. ఇందులో ఆమె నటన మరో బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. 
 

తమిళంలో విజయ్‌ తో `మాస్టర్‌` చిత్రంలో నటించే అవకాశం తీసుకొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 
 

ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్‌ తో `మారన్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు హిందీలో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది. మరికొన్ని ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నాయి. 

మరోవైపు తెలుగు ఎంట్రీకి సంబంధించి కూడా ప్లాన్‌జరుగుతుందట. మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమాలో హీరోయిన్‌గా ఈ అమ్మడి పేరు వినిపించింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

click me!