ఎలక్షన్స్ ఎప్పుడూ... నీళ్లులేని స్విమ్మింగ్ ఫూల్ లో దూకు, నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య వాడివేడి ట్విట్టర్ వార్!

First Published Jul 8, 2021, 12:54 PM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మా అధ్యక్ష ఎన్నికల బరిలో మేమున్నామంటూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, నటి హేమ, నటుడు నరసింహారావు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి 'మా' ఎలక్షన్స్ ఉండవు, ఏకగ్రీవమే అంటూ.. నటుడు మురళీమోహన్ బాంబు పేల్చారు. 
 

ఈ నేపథ్యంలో 'మా' ఎన్నికలు జరుగుతాయా లేక ఏకగ్రీవంతో ఎన్నికల వార్ కి చెక్ పెడతారా అనే మీమాంస కొనసాగుతుంది. ఎన్నికల బరిలో దిగిన ప్రకాష్ రాజ్, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మధ్య సోషల్ మీడియా వార్ కి తెరలేచింది. ట్వీట్స్ రూపంలో వాళ్ళు కామెంట్స్, కౌంటర్లు వేసుకుంటున్నారు.
undefined
ప్రకాష్ రాజ్ ఎన్నికలు ఎప్పుడు?, జస్ట్ ఆస్కింగ్.. అంటూ ట్వీట్ చేశాడు. ప్రకాష్ రాజ్ ట్వీట్ కి నటుడు అధ్యక్షుడు ఘాటు రిప్లై ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది జనరల్ బాడీ మీటింగ్ లో నిర్ణయించి,  దాని సారాంశం నోటీసు రూపంలో తెలియజేయడం జరిగింది. అయినా కొందరు పదేపదే ఎలక్షన్స్ ఎప్పుడు? అని అడగడం స్విమ్మింగ్ ఫూల్ లో నీళ్లు నింపకముందే దూకనా, అన్నట్లు ఉంది. ఇది మా సమాధానం, సరదాగా ఉంటే ట్రై చేయండి, సార్... అంటూ ట్వీట్ చేశారు.
undefined
ప్రకాష్ రాజ్ ట్వీట్ కి నరేష్ కౌంటర్ ట్వీట్ వైరల్ గా మారింది. అలాగే మా ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్, నరేష్ మధ్య పెద్ద వార్ నడుస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.
undefined
జయసుధ, సాయి కుమార్, బెనర్జీ, అనసూయ, సుధీర్, బండ్ల గణేష్, శ్రీకాంత్ తోపాటు 27మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ని ప్రకటించిన ప్రకాష్ రాజ్, ప్రస్తుత అధ్యక్షుడు, కమిటీపై తీవ్ర విమర్శలు చేశారు. మా కమిటీ పనితీరు సరిగా లేదన్నారు.
undefined
ప్రకాష్ రాజ్ కి మద్దతు పలికిన నాగబాబు గత నాలుగేళ్లుగా మా ప్రతిష్ట మసకబారిందని, వివాదాలతో కొందరు మా పరువు తీశారని అన్నారు. అలాగే ప్రకాష్ రాజ్ విజన్ గల వ్యక్తి, అతని నాయకత్వంలో మా అభివృద్ధి సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను అన్నారు. అలాగే చిరంజీవి మద్దతు కూడా నాగబాబుకు ఉన్నట్లు తెలియజేశారు.
undefined
నాగబాబు, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండించిన నరేష్ గత రెండేళ్ల కాలంలో మా అధ్యక్షుడిగా చేసిన పలు సంక్షేమ కార్యక్రమాల గురించి లెక్కలతో సహా వివరించారు. అలాగే ప్రకాష్ రాజ్, నాగబాబు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
undefined
ఎన్నికలకు రెండు నెలల సమయం ఉండగా ఇది అనవసర రాద్ధాంతం అంటూ నరేష్ అసహనం వ్యక్తం చేశాడు. కొద్దిరోజులుగా ఈ వేడి చల్లారినట్లు అనిపించినా, మరలా ట్వీట్ వార్స్ తో ఊపందుకుంది.
undefined
click me!